Last Updated:

OnePlus 13: వచ్చేస్తుందోచ్.. వన్‌ప్లస్ నుంచి రెండు ఫోన్లు.. లాంచ్ ఎప్పుడంటే..?

OnePlus 13: వచ్చేస్తుందోచ్.. వన్‌ప్లస్ నుంచి రెండు ఫోన్లు.. లాంచ్ ఎప్పుడంటే..?

OnePlus 13: వన్‌ప్లస్ ఇటీవలే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 13ను చైనాలో లాంచ్ చేసింది. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతుంది. దీనితో పాటు OnePlus 13Rను కూడా విడుదల చేయబోతుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా జనవరి 7న భారతదేశంలో లాంచ్ కానున్నాయి. అయితే లాంచ్‌కు ముందు ఈ ఫోన్ల గురించి అనేక లీకులు బయటకు వస్తున్నాయి. వీటిని బట్టి ఫీచర్లు అంచనా వేయచ్చు. రాబోయే ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

OnePlus 13 Features
వన్‌ప్లస్ 13 6.82-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ తాజా ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌లో పని చేయబోతోంది. కెమెరా మొదలైన వాటి గురించి మాట్లాడితే OnePlus ఈ స్మార్ట్‌ఫోన్ కోసం Hasselbladతో భాగస్వామ్యం కలిగి ఉంది.

ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది, ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్ (OISతో), 50MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేయగలదు. ఇది కాకుండా 6,000mAh బ్యాటరీ,  100W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో చూడవచ్చు.

OnePlus 13R
OnePlus 13R స్మార్ట్‌ఫోన్ OnePlus 13 సరసమైన వేరియంట్ కావచ్చు. OnePlus 13R కూడా OnePlus Ace 5 రీబ్రాండెడ్ వెర్షన్. ఈ ఫోన్‌లో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌లో లాంచ్ చేయవచ్చు.

ఇది కాకుండా, ఫోన్ 12GB RAM+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. కెమెరా సెటప్‌లో 50MP సోనీ IMX906 ప్రైమరీ సెన్సార్ (OISతో), 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్,  మరొక 2MP సెన్సార్ కూడా ఉండవచ్చు. చైనాలోని OnePlus Ace 5 6100mAh బ్యాటరీని కలిగి ఉంది. నివేదికలు నిజమైతే భారతదేశంలో OnePlus 13 ధర రూ. 67,000 నుండి రూ. 70,000 మధ్య ఉండవచ్చు, OnePlus 13R ప్రారంభ ధర రూ. 40,999గా అంచనా. OnePlus అధికారికంగా ఈ సమాచారాన్ని అందించలేదు.