5G Phones Under 10000: నిజమే నమ్మండి..ఈ 5జీ ఫోన్ల ధర రూ.పదివేల కన్నా తక్కువే.. ఫీచర్స్ తగ్గేదే లే..!

5G Phones Under 10000: మీరు కొత్త 5G ఫోన్‌ని కొనుగోలు చేయాలని చూస్తుంటే.. ఫ్లిప్‌కార్ట్ మీకు గొప్ప అవకాశాన్ని అందించింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో OMG గాడ్జెట్ సేల్ గత కొన్ని రోజులుగా కొనసాగుతోంది, అయితే ఈ సేల్‌కి ఈరోజు చివరి రోజు. అంటే ఈ సేల్ ఈ రాత్రికి ముగుస్తుంది. ఈ సేల్‌లో చాలా ఖరీదైన ఫోన్లు చౌకగా లభిస్తున్నాయి. మీరు కూడా రూ. 10,000 బడ్జెట్‌లో మంచి 5G ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ చివరి అవకాశాన్ని మిస్ చేయకండి. ఈ బెస్ట్ డీల్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
MOTOROLA g35 5G
మోటరోలా నుండి వచ్చిన ఈ గొప్ప ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్ చివరి రోజున గొప్ప డీల్ పొందుతోంది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ. 12,499కి పరిచయం చేసింది కానీ ఇప్పుడు మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ.9,999కే మీ సొంతం చేసుకోవచ్చు. Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఈ ఫోన్‌పై 5శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. దీనితో పాటు, డివైజ్‌పై ప్రత్యేక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ధరలో ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్‌ను అందిస్తుంది.
SAMSUNG Galaxy F06 5G
ఈ సేల్‌లో ఈ సామ్‌సంగ్ డివైస్ కూడా చాలా చౌక ధరకే లభిస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ. 13,999కి పరిచయం చేసింది కానీ ఇప్పుడు మీరు దీన్ని కేవలం రూ. 9,199కే మీ సొంతం చేసుకోవచ్చు. Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్‌తో కూడా అందుబాటులో ఉంది. అలానే ప్రత్యేక ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందిస్తున్నారు. ఇది ధరను మరింత తగ్గించడంలో సహాయపడుతుంది.
POCO C75 5G
పోకో ఇటీవలే ఈ మొబైల్‌ను విడుదల చేసింది. దీనిని మీరు ఇప్పుడు కేవలం రూ. 7,999కి సేల్‌లో కొనుగోలు చేయచ్చు. Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఫోన్‌లో 5శాత్ అపరిమిత క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో మీరు రూ. 3000 వరకు ఆదా చేసుకోవచ్చు. 4s Gen 2 5G ప్రాసెసర్ ఈ ఫోన్‌లో కనిపిస్తుంది.