Android Wireless Charging: ఏముంది మామ కిక్కు.. ఆండ్రాయిడ్లకు ఆపిల్ మాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్.. పిచ్చెక్కిస్తున్న అప్‌డేట్..!
Android Wireless Charging: సంవత్సరాల నిరీక్షణ తర్వాత, ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎట్టకేలకు Apple MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్‌ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. వైర్‌లెస్ పవర్ కన్సార్టియం లేదా WPC Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్ ఆండ్రాయిడ్‌కి వస్తుందని ధృవీకరించింది. ఈ టెక్నాలజీలో సామ్‌సంగ్, గూగుల్ ముందంజలో ఉన్నాయి. ఈ మేరకు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో వెల్లడించింది. ఇది చాలా కాలంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్ కోసం ఎదురుచూస్తున్న వారికి పెద్ద అప్‌డేట్.
Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్ అంటే ఏమిటి?
Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్ ఒక పెద్ద అప్‌గ్రేడ్, ఇది పాత Qi ప్రమాణాన్ని భర్తీ చేస్తుంది. దీని సహాయంతో మీరు 15W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌తో మీ గ్యాడ్జెట్‌ని వైర్‌లెస్‌గా ఛార్జ్ చేయగలరు. ఈ టెక్నాలజీ మీ పరికరాన్ని ఛార్జర్‌కి అటాచ్ చేయడానికి మాగ్నెటిక్ రింగ్‌ని ఉపయోగిస్తుంది. ఇది ఇంతకముందు కంటే మరింత సమర్థవంతంగా చేస్తుంది. ఆపిల్ MagSafe 2023లో ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించినప్పటికీ, Android ఫోన్‌లు ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాయి.
Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్‌ని తీసుకురావడం గురించి సామ్‌సంగ్, గూగుల్ రెండూ అధికారికంగా సమాచారాన్ని పంచుకున్నాయి. సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్లు Qi2కి ఈ ఏడాది చివర్లో మద్దతునిస్తాయని ప్రకటించింది. అయితే ఈ నెల జనవరి 22న విడుదల కానున్న గెలాక్సీ S25 సిరీస్‌కి Qi2 సపోర్ట్ ఉందా లేదా అనేది ఇంకా ధృవీకరించలేదు. S25 Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ పొందవచ్చని లీక్‌లు సూచిస్తున్నాయి, అయితే దాని ఫుల్ పవర్ చూడటానికి గెలాక్సీ S26 వరకు వేచి ఉండవలసి ఉంటుంది.
మరోవైపు, గూగుల్ ప్రత్యేకంగా ఏదో ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా Qi 2.2 అభివృద్ధితో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో పెద్ద పాత్ర పోషిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ వినియోగదారులకు సమస్యగా ఉన్న క్రాస్-బ్రాండ్ అనుకూలతను మెరుగుపరచడం గూగుల్ లక్ష్యం. ఇది జరిగితే, రాబోయే అనేక ఫోన్‌లు మెరుగైన వైర్‌లెస్ ఛార్జింగ్‌ను అందిస్తాయి.
చాలా కాలంగా ఆపిల్ వినియోగదారులకు MagSafeతో మెరుగైన వైర్‌లెస్ ఛార్జింగ్ అనుభవాన్ని అందిస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో వైర్‌లెస్ ఛార్జింగ్ అందుబాటులో ఉన్నప్పటికీ, ఇది అంతగా అందుబాటులోకి రాలేదు. Qi2 రాక చివరకు ఇందులో పెద్ద మార్పును తీసుకురావచ్చు. మాగ్నెటిక్ అలైన్‌మెంట్ సిస్టమ్‌ను స్వీకరించడం ద్వారా Android గ్యాడ్జెట్లు వైర్‌లెస్‌గా వేగంగా ఛార్జ్ అవుతాయి.