Home / YSRCP
వైజాగ్ లో విశాఖ గర్జన పేరుతో తలపెట్టిన వైసీపి రాజకీయ యాత్ర తుస్ మందన్నారు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని లోకేష్ ఖండించారు.
జనసేన కార్యక్రమం ఎలా నిర్వహించాలో వైసీపీ పార్టీ నిర్దేశిస్తుందా? మేము ఏ కార్యక్రమం చేస్తామో మీకు చెప్పాలా అంటూ జనసేన అధినేత పవన కళ్యాణ్ ప్రశ్నించారు.
3 రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అందులో భాగంగానే ఉత్తరాంధ్రలో విశాఖ గర్జనకు పిలుపునిస్తున్నామని రాష్ట్ర మంత్రులు పదే పదే పేర్కొన్నారు.
ప్రాజెక్టులపై అవగాహన లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారని, పులివెందుల, కుప్పం ప్రాంతాలకు నీరెవరిచ్చారు? చెప్పండి సీఎం అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఉమా ఏపి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంద్ర ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నాడని మాజీమంత్రి వైసీపీ నాయకుడు అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు.
పవన్ జోలికి వస్తే తాట తీస్తానంటున్న బొలిశెట్టి
విశాఖపట్టణంలో తనకు భూములు లేవని, తాను విశాఖలో భూములు అమ్మలేదు.. కొనలేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేసారు.
వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ల యుద్ధం కొనసాగిస్తున్నారు. "యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర"గా పేర్కొంటూ జనసేనాని తాజాగా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ను కూడా "యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రగా ప్రకటించాలన్నారు.
వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విశాఖలోతన కుమార్తె, అల్లుడి కంపెనీ పేరుపై భూములు కొనుగోలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా మధనం జరుగుతోందట. అసలు ఏంటి మన పరిస్థితి అని కూడా గెలిచిన ఎమ్మెల్యేలు కుర్చీలు ఎక్కిన మంత్రులు చాలా మంది అనుకుంటున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.