Home / YSRCP
సీఎం జగన్ ఓ పిల్లి నా కొడుకుగా తెదేపా నేత నారా లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ బయటకొస్తే ఇళ్ల తలుపులు, దుకాణాలు మూసేయిస్తారని మండిపడ్డారు. తాడేపల్లిలో సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని లోకేష్ ప్రారంభించారు.
వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు పొందిన మంత్రి రోజాకు ఇంటిపోరు మాత్రం తప్పడం లేదు. సీఎం జగన్కు సన్నిహితురాలిగా పేరుపొందిన ఆమె, రాజకీయ పరిస్థితి పైకి బాగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నా, సొంత నియోజకవర్గం నగరిలో మాత్రం ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సీఎంను అర్జంటుగా ఈఎన్టీ స్పెషలిస్ట్ వైద్యుడికి చూపించాలని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై జగన్ విమర్శలు చేసిన క్రమంలో ఆ పార్టీ శ్రేణులో రగిలిపోతున్నారు. జగన్మోహన రెడ్డి అవనిగడ్డలో ఇష్టమొచ్చిన్నట్లు మాట్లాడరని మండిపడ్డారు.
ఇటీవల వివాదాలతో వార్తల్లో కెక్కిన వైసీపీ నేత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గురువారం టీచర్ అవతారం ఎత్తారు. మేడికొండూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పాఠాలు చెప్పారు.
భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు.
ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ సీఎం సీటులో కూర్చోవాల్సిందే. ఇది పవన్ కల్యాణ్ పట్టుదల. ఆయన ఆ దిశగానే క్యాడర్కి క్లారిటీ ఇచ్చేశారు.
జగన్ మంత్రివర్గంలోని కొంతమంది మంత్రులు ప్యాకేజీలతో పాలన చేస్తున్నారని దెందలూరు జనసేన నాయకురాలు డాక్టర్ వెంకటలక్ష్మీ గంటసాల పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మరొక్కసారి ప్యాకేజి పవన్ కల్యాణ్ అంటే ఒప్పుకోమని ఆమె హెచ్చరించారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్ట్ నోటీసులు ఇచ్చింది. వంశీ ఎన్నిక చెల్లదని వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు వేసిన పిటిషన్ పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
పవన్ కల్యాణ్ మంచితనం, సహనం మాత్రమే ఇప్పటి వరకు చూశారు. ఇకపై యుద్ధమే, మీరు సిద్ధమా అంటూ జనసేన సైనికులను అడిగితే మార్మోగిన కరాళధ్వనుల నడుమ అభిమానులు ఓకే చేశారు.
నా కన్నతల్లిని, చిన్నారులను తిట్టడం ఏంటిరా మీ సంస్కరహీనానికి హద్దులేదా అంటూ వైసిపిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిట్టిపోశారు. తనకు భాష రాదనుకొంటే పొరపాటన్నారు. మంగళగిరి సభలో వైకాపా నేతల తీరును ఆయన ఎండగట్టారు.