Last Updated:

Janmabhoomi Express: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. సికింద్రాబాద్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ స్టాప్ రద్దు

Janmabhoomi Express: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. సికింద్రాబాద్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ స్టాప్ రద్దు

Lingampalli Visakhapatnam Janmabhoomi Express Stoppage At Secunderabad Cancelled: ప్రయాణికులకు బిగ్ అలర్ట్. సికింద్రాబాద్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ స్టాప్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఏప్రిల్ 25 నుంచి ఈ రైలును నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు విశాఖ టూ లింగంపల్లి టూ విశాఖ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ మార్గాన్ని చర్లపల్లి టూ అమ్ముగూడ టూ సనత్‌నగర్ మీదుగా శాశ్వత ప్రాతిపదికన దారి మళ్లించనున్నట్లు తెలిపారు.

 

వాస్తవానికి ఈ రైలు నిత్యం విశాఖ నుంచి లింగంపల్లికి సేవలు అందిస్తోంది. తాజాగా, రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు ఏప్రిల్ 25 నుంచి ఈ రైలు లింగంపల్లి టూ చర్లపల్లి మీదుగా నడవనుంది. ఇందులో భాగంగానే ఏప్రిల్ 25 నుంచి సికింద్రాబాద్, బేగంపేట్ స్టేషన్ల నుంచి వెళ్లదని వాల్తేర్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గుర్తించుకోవాలని సూచించారు. మిగతా వివరాలకు సికింద్రాబాద్ స్టేషన్‌లో సిబ్బందిని సంప్రదించాలని చెప్పారు.

 

ఇదిలా ఉండగా, రైళ్లలో అందించే ఫుడ్ మెనూ విషయంలో ప్రయాణికులకు సమాచారం అందించేలా బోర్డ్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో ప్రస్తావించారు. ప్రస్తుతం రైళ్లల్లో అందుబాటులో ఉండే ఫుడ్ మెనూ కార్డుతో పాటు ఫుడ్ ధరల వివరాలు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటికే ప్రింట్ చేసిన మెనూ కార్డులు వెయిటర్లతో ఉంచినట్లు తెలిపారు. ఒకవేళ ప్రయాణికులు అడిగితే అందిస్తామని సభలో ప్రస్తావించారు.