Home / Ukraine
ఉక్రెయిన్‌పై సోమవారం రాత్రి భారీ ఎత్తున క్షిపణులతో రష్యా విరుచుకుపడింది. రాజధాని కీవ్ సహా ఇతర నగరాలపై ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల దెబ్బకు రాత్రి మొత్తం ఉక్రెయిన్ నగరాల్లో సైరన్లు మోగుతూనే ఉన్నాయి
ఉక్రెయిన్ లోని కఖోవ్కా ఆనకట్ట ధ్వంసంతో దక్షిణ ప్రాంతాల్లో వరద పోటెత్తింది. వరదల కారణంగా కనీసం ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, రష్యా తన దళాల ఆధీనంలో ఉన్న భూభాగాల్లో కనీసం ఎనిమిది మంది మరణించినట్లు తెలిపింది.
రష్యా నియంత్రణలో ఉన్న దక్షిణ ఉక్రెయిన్‌లో సోవియట్ కాలం నాటి భారీ కట్టడం అయిన నోవా కఖోవ్కా డ్యామ్ వీడియో తెగిపోయినట్లు వీడియో వైరల్ అయింది. రష్యా, ఉక్రెయిన్లు ఉద్దేశపూర్వక దాడికి పాల్పడ్డారంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.వీడియోలు డ్యామ్ అవశేషాల గుండా నీరు ప్రవహించడాన్ని చూపించాయి.
ఉక్రెయిన్‌కు అమెరికా తయారు చేసిన ఎఫ్-16 ఫైటర్ జెట్లను అందించడం ద్వారా నిప్పుతో చెలగాటమాడుతున్నారని రష్యా ఆదివారం పశ్చిమ దేశాలకు గట్టి హెచ్చరిక చేసింది.రష్యన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు
రెండు రష్యన్ జెట్లు మరియు రెండు మిలిటరీ హెలికాప్టర్లను ఉక్రేనియన్ సరిహద్దు సమీపంలో కాల్చివేయగా, ఐదవ విమానం శనివారం రష్యా వైపు కూలిపోయిందని రష్యా వార్తా నివేదికలు తెలిపాయి. బ్రయాన్స్క్ ప్రాంతంలో జరిగిన ఆకస్మిక దాడిలో Su-34 ఫైటర్-బాంబర్, Su-35 ఫైటర్ మరియు రెండు Mi-8 హెలికాప్టర్లు దాదాపు ఏకకాలంలో కాల్చివేయబడ్డాయి.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హత్య చేయడానికి ఉక్రెయిన్ కుట్ర పన్నినట్లు క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. గత రాత్రి డ్రోన్ల ద్వారా క్రెమ్లిన్‌పై దాడులు జరిగాయని, అయితే పుతిన్ మాత్రం సురక్షితంగా ఉన్నారని.. తన పనులు తాను చేసుకుంటున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ‘కాళీ మాత’ ఫొటోతో ఉక్రెయిన్ ఇటీవల ఓ వివాదాస్పద ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది దీనిని హిందువుల మనోభావాలపై ఉక్రెయిన్ దాడి అంటూ పేర్కొన్నారు.
NATO Allies: నాటో మిత్రదేశాలు మరియు భాగస్వాములు ఉక్రెయిన్‌కు 1,550 సాయుధ వాహనాలు మరియు 230 ట్యాంకులను అందించారు. రష్యా దళాల నుండి భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో సహాయపడుతున్నారని నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ గురువారం తెలిపారు. 98 శాతం కంటే ఎక్కువ ఇచ్చాము..( NATO Allies) గత సంవత్సరం ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఉక్రెయిన్‌కు వాగ్దానం చేసిన పోరాట వాహనాల్లో 98 శాతం కంటే ఎక్కువ డెలివరీ చేసామని స్టోల్టెన్‌బర్గ్ ఒక వార్తా […]
కెనడియన్ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉక్రెయిన్ కోసం కొత్త సైనిక సహాయంగా$28.9 మిలియన్లు ప్రకటించింది, ఇందులో 40 స్నిపర్ రైఫిల్స్, 16 రేడియో సెట్లు మరియు రష్యాపై యుద్ధంలో సహాయం చేయడానికి ’నాటో ‘ఫండ్‌కు విరాళం అందించబడుతుంది., ఇందులో రైఫిల్స్ కోసం మందుగుండు సామగ్రి కూడా ఉంది.
యుద్దంలో పూర్తిగా దెబ్బతిన్న ఉక్రెయిన్ను ఆదుకునేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ముందుకొచ్చింది. వచ్చే నాలుగేళ్లకు 15.6 బిలియన్ డాలర్ల రుణం సాయం అందించడానికి అంగీకరించింది