Home / tollywood
పంజా వైష్ణవ్ తేజ్ నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ “రంగ రంగ వైభవంగా” సెప్టెంబర్ 2న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కుటుంబ సభ్యులను, యూత్‌ని ఉర్రూతలూగిస్తూ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈరోజు నిర్మాతలు కొత్తగ లేదేంటి వీడియో సాంగ్‌ని ఆవిష్కరించారు.
నేడు నాగార్జున 63 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.అక్కినేని నాగార్జున అగష్టు 29న 1959 లో జన్మించారు.నాగార్జున 100 కి పైగా సినీమాల్లో నటించిన ఇప్పటికి మన్మధుడు గానే ఉంటాడు. ఒకప్పుడు టాలీవుడ్ నాలుగు స్తంభాల్లో నాగర్జున కూడా ఒకరు.
టాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్స్ లిస్టులో కృష్ణ వంశీ కూడా ఒకరు. గులాబీ, సింధూరం, ఖడ్గం, అంతఃపురం లాంటి సినిమాలతో అందరి దృష్టిని తన వైపుకు మళ్లించుకున్న ఈ డైరెక్టర్ 2017 న నక్షత్రం అనే సినిమాకు దర్శకత్వం వహించిన మన అందరికీ తెలిసిన విషయమే.ఈ సినిమా ఫ్లాప్ ఐన తర్వాత ఇతను ఏ సినిమాకు మళ్ళీ డైరెక్ట్ చేయలేదు.
నటి పవిత్రా లోకేష్ వివాదంతో వెలుగు లోకి వచ్చిన నటుడు నరేష్ తాజాగా ఒక ట్వీట్ చేసాడు . సినిమా టికెట్స్ ధరపై నరేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే.
కామెడీ కింగ్ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నాడు. అతని చివరి చిత్రం 2018లో వచ్చిన'మను'. అయితే రాజా గౌతమ్ ఈ చిత్రంతో విజయాన్ని అందుకోలేకపోయాడు ఇప్పుడు అతను తన కొత్త చిత్రంతో ప్రేక్షకులముందుకు వస్తున్నాడు.
తెలుగు చిత్ర పరిశ్రమలో రవితేజకు ఉన్న క్రేజే వేరు . అందరు మాస్ మహారాజా అని పిలుచుకుంటారు. రవి తేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమా జూలై 29న థియేటర్లో సందడి చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో తొందరలో విడుదల అవ్వబోతుంది .సెప్టెంబరు నెలలో స్ట్రీమింగ్ అవ్వనుంది.
ఒకప్పుడు సెలవు దొరికితే చాలు థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే వాళ్ళం. ఇప్పుడు సెలవు దొరికితే ప్రైమ్ లో క్లాస్ సినిమాలు ఏమి ఉన్నాయి. ఆహలో మాస్ ఏమి సినిమాలు ఉన్నాయి. హాట్ సార్లో సీరియల్స్ తరువాత ఎపిసోడ్స్ చూడటం ఇలా చేస్తున్నాం. ప్రస్తుతం ట్రెండ్ ఇలా నడుస్తుంది.
కింగ్ నాగార్జున అప్ కమింగ్ మూవీ ది ఘోస్ట్ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది మరియు దసరా సందర్భంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన మహేష్‌కి నాగార్జున ధన్యవాదాలు తెలిపారు.
విక్టరీ వెంకటేష్ తన తదుపరి చిత్రం ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం అతను వివిధ ప్రాజెక్ట్‌ల కోసం చర్చలు జరుపుతున్నాడు. దిల్ రాజు మరియు పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్న ’ఓరి దేవుడా‘ అనే చిత్రంలో అతను అతిధి పాత్రలో కనిపించనున్నాడు. వెంకటేష్ డైరెక్టర్ శివ నిర్వాణతో చర్చలు జరుపుతున్నాడు.
టాలీవుడ్ సమ్మె గురించి ఆలోచించకుండా తన తదుపరి షెడ్యూల్‌ను టర్కీలో ప్రారంభించాలని నందమూరి బాలకృష్ణ తన నిర్మాతలను కోరారు. నిర్మాతలు సమ్మెను విరమించడంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దీనితో బాలయ్య చిత్రం యొక్క తారాగణం, సిబ్బంది టర్కీకి చేరుకున్నారు.