Home / Telangana
ఉప ఎన్నికకు సిద్ధమవుతున్న మునుగోడులో టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే మళ్లీ అవకాశం ఇవ్వనున్నట్టు టీఆర్ఎస్ నేతలు సంకేతాలు ఇవ్వడంతో పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఇవాళ సమావేశం కానుంది. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 8 నుండి 22వ తేదీ వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలు జరుగుతున్నాయి.
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. నిన్న50.50 అడుగులు ఉన్న గోదావరి ప్రవాహం ఈరోజు 51.60 అడుగులకు చేరింది. కాగా భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. 13 లక్షల 49 వేల 465 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు.
నకిలీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ఈ ముఠా దగ్గర్నుంచి పెద్ద మొత్తంలో నకిలీ సర్టిఫికెట్లను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విస్తారంగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరికి వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 49. 50 అడుగులకు చేరింది. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.
మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ దృష్టిసారించింది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. కొమటిరెడ్డి బద్రర్స్ పై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఎలాగైన మునుగోడును గెలుచుకోవాలని భావిస్తున్నారు.
ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి తన రాజీనామా లేఖను సమర్పించారు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ సమర్పించారు. దీనికి ముందు అసెంబ్లీ రోడ్డులోని గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. తన రాజీనామా లేఖను మీడియా సమక్షంలో అందరికి చూపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో మరొక వికెట్ పడింది. పార్టీకి కీలక నేత దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు. ప్రస్తుతం దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టి.కాంగ్రెస్‌లో విజయారెడ్డి (Vijayareddy) చేరికపై దాసోజు శ్రవణ్ అసంతృప్తితో ఉన్నారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖం చూసేది లేదని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆయన ఫైరయ్యారు. తనను ఓడించాలని ప్రయత్నించిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు.
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జైపూర్ గురకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. సాయంత్రం స్నాక్స్ తిన్న తరువాత 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో 14మంది విద్యార్థుల