Last Updated:

Minister KTR: వారసత్వ రాజకీయాల పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ వారసత్వ రాజకీయాల పై  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారసత్వం అనేది రాజకీయాల్లోకి ప్రవేశించడానికి మాత్రమే పని చేస్తుందని, ప్రతిభను నిరూపించుకోకపోతే రాజకీయాల్లో ఏ ఒక్కరూ రాణించలేరన్నారు.

Minister KTR: వారసత్వ రాజకీయాల పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Hyderabad: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ వారసత్వ రాజకీయాల పై  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారసత్వం అనేది రాజకీయాల్లోకి ప్రవేశించడానికి మాత్రమే పని చేస్తుందని, ప్రతిభను నిరూపించుకోకపోతే రాజకీయాల్లో ఏ ఒక్కరూ రాణించలేరన్నారు. ప్రతిభ లేకుండా వారసత్వంతో రాజకీయాల్లో రాణించవచ్చని చాలా మంది అనుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. ఆ భావన తప్పు అని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీడియా ఇన్ తెలంగాణ ఫాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అనే అంశంపై శనివారం జరిగిన చర్చలో కేటీఆర్ కీలక ప్రసంగించారు.

ఈ ప్రసంగంలో  రాజకీయ వారసత్వాన్ని ప్రస్తావించిన కేటీఆర్, వారసత్వం కేవలం రాజకీయాల్లోకి ప్రవేశాన్ని మాత్రమే ఇస్తుందన్నారు. అనంతరం సొంతంగా తమని తాము నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వ నాయకుడిని ప్రజలు భరించరని చెప్పారు. ఇందిరా గాంధీ లాంటి నేతలనే ప్రజలు ఓడించారని ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలో తన అంశాన్నే ఇందుకు ఉదాహరణగా కేటీఆర్  చెప్పుకొచ్చారు. తనకు తన పనితీరుతోనే సిరిసిల్లలో క్రమంగా మెజారిటీ పెరుగుతూ వస్తోందని, తాను సరిగ్గా పనిచేయకపోయి ఉంటే, సిరిసిల్ల ప్రజలు తనను ఎప్పుడో పక్కనపెట్టేవారని అన్నారు.

ఇవి కూడా చదవండి: