Home / Telangana News
ఎగువ నుంచి పోటెత్తున్న వరదకు ఉపనదుల సంగమం తోడై గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణలో గోదావరి ప్రవేశించే నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద తెలంగాణ-మహారాష్ట్రలను కలిపే వంతెనను ఆనుకుని ప్రవాహం కొనసాగుతోంది. ప్రాచీన శివాలయం వరద నీటిలో మునిగిపోయింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా ప్రవాహం పోటెత్తుతోంది.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో వరద వస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో గతంలో ఎన్నడూ లేని విధంగా వరదనీరు వచ్చి చేరుతోంది. మంగళవారం రాత్రి నుంచి ప్రాజెక్టుకు వరద ఉధృతి భారీగా కొనసాగుతుంది. వరద నీరు తీవ్రంగా పోటెత్తుతుండటంతో ప్రాజెక్ట్‌లో నీటిమట్టం ప్రమాద స్థాయిలో ఉందని అధికారులు
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మౌన దీక్ష ప్రారంభమైంది. పోడు భూములు, గిరిజన సమస్యపై జిల్లాలోని తన కార్యాలయంలో సంజయ్ దీక్షలో కూర్చుకున్నారు. నల్ల బ్యాడ్జీ కట్టుకుని దీక్ష చేపట్టారు. మౌన దీక్ష వేదికపై సీఎం కేసీఆర్ కోసం బీజేపీ నేతలు కుర్చీ వేశారు.
రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలనేపధ్యంలో ప్రాణనష్టం జరుగకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. జనజీవనానికి ఆటంకాలు తగ్గించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండియర్ ఇంగ్లిష్ సిలబస్‌లో మార్పులు చేశారు. ఈ ఏడాది నుంచే కొత్త సిలబస్ తో ఇంగ్లిష్ పుస్తకాలను ముద్రించారు. త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి. తన కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కొత్త ఇంగ్లిష్ పుస్తకాలను విడుదల చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఇల్లందు పరిధిలోని సింగరేణి గనుల్లో భారీగా వరద నీరు నిలుస్తోంది.
అమర్నాథ్ యాత్రలో పోటెత్తిన వరద కారణంగా 15 మంది ప్రాణాలు కోల్పోగా, 40 మంది దాకా గల్లంతైనట్లు సమాచారం. అమర్నాథ్ యాత్రకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన కుటుంబంతో కలిసి వెళ్లారు.
తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణలోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.