Home / Team India
సౌతాఫ్రికాకు నెదర్లాండ్స్ బిగ్ షాక్ ఇచ్చింది. సెమీఫైనల్ కు చేరుతుందని భావించిన సౌతాఫ్రికా జట్టు నెదర్లాండ్స్ చేతిలో ఓటమిని చదవిచూసింది. దానితో సెమీస్ చేరకుండానే ఇంటి బాట పట్టింది. సౌతాఫ్రికా ఓడిపోవడంతో.. నేడు జరుగనున్న జింబాబ్వే మ్యాచ్ లో గెలుపోటములతో సంబంధం లేకుండా భారత్ సెమీఫైనల్ కు చేరుకుంది.
డిసెంబర్ 4 నుండి 26వరకు బంగ్లాదేశ్ లో జరగనున్న క్రికెట్ పోటీల్లో టీమిండియా జట్టును బీసిసిఐ ప్రకటించింది.
టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు మంచి ఫాం కనపరుస్తోంది. ఇండియా పొట్టి ప్రపంచకప్ లో తన రెండవ విజయాన్ని నమోదు చేసింది. ఇవాళ గ్రూప్ 2లోని నెదర్లాండ్స్‌తో జరిగిన పోటీలో 56 పరుగుల తేడాతో భారత్ విజయకేతనం ఎగురవేసింది.
భారత క్రికెట్ జట్టు మరో అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్ ఛేజింగ్‌లో అత్యధికంగా 300 సార్లు విజయం సాధించిన జట్టుగా టీం ఇండియా చరిత్రకెక్కింది.
టీ20 ప్రపంచకప్ ముంగిట టీం ఇండియా ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతున్నారు. ఇప్పటికే రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడి ఈ టోర్నీకి దూరం అయ్యారు. కాగా ఇప్పుడు ప్రపంచకప్ స్టాండ్ బై బౌలర్లలో ఒకరైన దీపక్ చాహర్ కూడా గాయపడ్డాడు.
టీమిండియాకు భారీ షాక్. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ 2022 నుంచి టీం ఇండియా స్టార్ క్రికెటర్ తప్పుకున్నాడు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు. తీవ్రమైన వెన్ను నొప్పి కారణంగా టీ20 ప్రపంచకప్‌లో పేస్ గుర్రం బుమ్రా ఆడడం లేదు.
గత కొద్దిరోజులుగా జడేజా మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని ఇంటికే పరిమితమవ్వగా అతనిని పలకరించడానికి ధావన్ ఆసుపత్రికి వెళ్లారు. కాగా తను నొప్పితో బెడ్ పై ఉండగా ధావన్ డాన్స్ చేస్తూ సందడి చేస్తాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో రోహిత్ సేన ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచ్ విజయంతో టీం ఇండియా టీ20లలో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా చరిత్రకెక్కింది. గతంలో పాకిస్తాన్ పేరిట ఉన్న ఈ రికార్డును బద్దలుకొట్టడమేకాక కొత్త రికార్డును సృష్టించింది.
కుర్రకారులో కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేం కాదండోయ్. సామాజిక మాధ్యమాల్లోనూ కోహ్లీకి అభిమానులు కొదవలేదు. అయితే ట్విట్టర్లో అరుదైన ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా కోహ్లీ రికార్డుకెక్కారు. మరి ఆ ఘనత ఏంటో చూసేయ్యండి.
ఆసియా ప్రపంచకప్-2022 ఫైనల్ పోరు నేడు రసవత్తరంగా సాగనుంది. ఆసియా కప్ కోసం శ్రీలంతో పాకిస్థాన్ తలపడనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.