Home / Russia
సెంట్రల్ రష్యాలోని ఓ పాఠశాలపై సోమవారం ఉదయం ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు విద్యార్థులు సహా మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయని ఉద్ముర్తియా ప్రాంత గవర్నర్ అలెగ్జాండర్ బ్రెచాలోవ్ ఓ వీడియో ద్వారా ప్రకటించారు
ఉక్రెయిన్‌తో యుద్ధంలో కొన్నాళ్లుగా రష్యాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మెరుపు దాడులతో ఉక్రెయిన్ దళాలు మాస్కో సేనలను భారీగా దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
దాదాపు ఏడు నెలలుగా రష్యా తో కొనసాగుతోన్న యుద్ధంతో ఉక్రెయి న్ అతలాకుతలమవుతోంది. పుతిన్ సేనల దాడుల్లో పెద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టాలు తప్పడం లేదు.
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మరి ఆహారం, ఎరువుల కొరత, ఇంధన భద్రత సమస్యల పరిష్కారం ముఖ్యమని, నేటి యుగం యుద్ధ యుగం కాదని ప్రధాని మోదీ రష్యా అద్యక్షుడు పుతిన్ తో అన్నారు. ఉబెకిస్తాన్ లోని సమర్కండ్ లో జరిగిన షాంగై సహకార సంస్ధ శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొన్నారు
రష్యా అధ్యక్షుడు పుతిన్ పై కారు బాంబు దాడి జరిగిందంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. ఆయన ప్రయాణిస్తున్న కారుపై బాంబు దాడి జరిగిన్నట్లు జనరల్ జీవీఆర్ టెలిగ్రామ్ ఛానల్ వెల్లడించింది
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు వచ్చే వారం ఉజ్బెకిస్థాన్‌లో జరిగే శిఖరాగ్ర సమావేశంలో సమావేశం కానున్నారు. సెప్టెంబరు 15-16 తేదీల్లో ఉజ్బెక్‌లోని సమర్కండ్ నగరంలో జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు సమావేశమవుతారని చైనాలోని రష్యా రాయబారి ఆండ్రీ డెనిసోవ్ విలేకరులకు తెలిపారు.