Home / Russia
సాంకేతిక లోపంతో రష్యాలో ల్యాండ్ అయిన ఎయిరిండియా విమాన ప్రయాణికులకు ఎట్టకేలకు అమెరికా పయనమయ్యారు. దాదాపు 39 గంటల తర్వాత గురువారం ఉదయం మరో విమానంలో ప్రయాణికులంతా శాన్ ఫ్రాన్సిస్కో కు బయలు దేరారు.
ఎయిర్ ఇండియా విమానం రష్యాలోని మగడాన్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. అయితే భారతీయ ప్రయాణికులకు భాషా సమస్య, ఆహారం, అరకొర వసతి వంటి వాటితో నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిరిండియా విమానం ఇంజిన్‌లో లోపం కారణంగా రష్యాలోని మగదాన్‌కు దారి మళ్లించారు. ఎయిర్ ఇండియా అధికారి తెలిపిన వివరాల ప్రకారం విమానం రష్యాలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారని ఒక అధికారి తెలిపారు.
ఎయిరిండియా విమానం రష్యాలో ఎమెర్జెన్సీ ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో కు బయలు దేరిన విమానం ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా రష్యా కు మళ్లించారు. అక్కడ సురరక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రష్యా నియంత్రణలో ఉన్న దక్షిణ ఉక్రెయిన్‌లో సోవియట్ కాలం నాటి భారీ కట్టడం అయిన నోవా కఖోవ్కా డ్యామ్ వీడియో తెగిపోయినట్లు వీడియో వైరల్ అయింది. రష్యా, ఉక్రెయిన్‌లు ఉద్దేశపూర్వక దాడికి పాల్పడ్డారంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.వీడియోలు డ్యామ్ అవశేషాల గుండా నీరు ప్రవహించడాన్ని చూపించాయి.
2019లో నార్వేలో తిరిగిన బెలూగా తిమింగలం స్వీడన్ తీరంలో మళ్లీ కనిపించింది.ఇది రష్యన్ నావికాదళం ద్వారా శిక్షణ పొందిన గూఢచారి అని ఊహాగానాలకు దారితీసింది, మానవ నిర్మిత జీను కారణంగా తిమింగలం రష్యా నావికాదళం ద్వారా శిక్షణ పొందిందని ఊహాగానాలు చెలరేగాయి.
రష్యా కీలక భవనాలు ఉండే క్రెమ్లిన్‌పై రెండు డ్రోన్లు దాడికి యత్నించడంతో అధ్యక్షుడు పుతిన్ భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమైంది.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హత్య చేయడానికి ఉక్రెయిన్ కుట్ర పన్నినట్లు క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. గత రాత్రి డ్రోన్ల ద్వారా క్రెమ్లిన్‌పై దాడులు జరిగాయని, అయితే పుతిన్ మాత్రం సురక్షితంగా ఉన్నారని.. తన పనులు తాను చేసుకుంటున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
భారతదేశం మరియు రష్యాలు పరస్పరం దేశంలో రూపే మరియు మీర్ కార్డులను అంగీకరించే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయి.వాణిజ్యం, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక మరియు సాంస్కృతిక సహకారం (IRIGC-TEC)పై ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి అంతర్గత ప్రభుత్వ కమిషన్ సమావేశంలో, ఈ కార్డుల ఆమోదాన్ని అనుమతించే అవకాశాన్ని అన్వేషించడానికి చర్చించి, అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఉక్రెయిన్‌తో యుద్ధం ఉన్నప్పటికీ రష్యాలోని అత్యంత సంపన్నుల సంపద గత ఏడాది కాలంలో 152 బిలియన్ డాలర్లు పెరిగిందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం, సహజ వనరులకు పెరిగిన ధరల కారణంగా బిలియనీర్ల సంఖ్య సంపద పెరిగింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన వెంటనే వారు అదృష్టవంతులయ్యారు.