Home / RBI
విదేశీ కరెన్సీలతో పోలిస్తే రూపాయి మారకపు విలువ క్షీణత తక్కువగానే ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్ధికపరమైన అంశాలపై వస్తున్న పలు విమర్శలపై ఆయన స్పందిస్తూ వ్యాఖ్యానించారు.
ద్రవ్యోల్బణం పెరిగిపోతుండడంతో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకొనింది. నవంబర్ 3న మానిటరీ పాలసీ కమిటి (ఎంపీసీ) భేటిని బెంగళూరులో నిర్వహించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేట్లను మరోసారి పెంచింది. రెపో రేట్ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ క్రమంలో రెపో రేట్ 5.40 నుంచి 5.90 శాతానికి పెరిగింది. కాగా, గడిచిన ఐదు నెలల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగింది.
క్రిప్టోకరెన్సీపై లోకసభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా క్రిప్టో కరెన్సీని నిషేధించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసిందని తెలిపారు. కాగా వీసీకె ఎంపీ తిరుమావాలవన్ అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి స్పందిస్తూ, క్రిప్టో కరెన్సీని అనుమతిస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై