Last Updated:

Rahul Gandhi: కార్పొరేట్లకు కాదు..గుత్తాధిపత్యానికి నేను వ్యతిరేకం… పేర్కొన్న రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ పెట్టుబడులపై హుందాగా మాట్లాడారు. తాను కార్పొరేట్లకు కాదు, కేవలం గుత్తాధిపత్యం చేస్తున్న వ్యవస్ధలకు మాత్రమే తాను వ్యతిరేకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ లో వ్యాపార దిగ్గజం అదానీ రూ.65వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో రాహుల్ ఈ విధంగా వ్యాఖ్యానించారు

Rahul Gandhi: కార్పొరేట్లకు కాదు..గుత్తాధిపత్యానికి నేను వ్యతిరేకం… పేర్కొన్న రాహుల్ గాంధీ

Rajasthan: భారత్ జోడో యాత్రలో ఆసక్తికరం సన్నివేశం చోటు చేసుకొనింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరిపూర్ణత కల్గిన వ్యక్తిగా నిరూపించుకొన్నారు. మీడియా సమావేశంలో ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన రాహుల్ గాంధీ పెట్టుబడులపై హుందాగా మాట్లాడారు. తాను కార్పొరేట్లకు కాదు, కేవలం గుత్తాధిపత్యం చేస్తున్న వ్యవస్ధలకు మాత్రమే తాను వ్యతిరేకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ లో వ్యాపార దిగ్గజం అదానీ రూ.65వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో రాహుల్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.

వివరాల మేరకు, గౌతమ్ అదానీకి చెందిన సంస్ధలు రాజస్ధాన్ లో రూ. 60వేల కోట్లు పెట్టుబడుల రూపంలో పెట్టేందుకు ముందుకొచ్చారు. దీన్ని స్వాగతిస్తూ రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ గౌతమ అదానీని ప్రశంసించారు. దీంతో భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించే క్రమంలో అదానీ-అంబానీలను లక్ష్యంగా మాట్లాడుతుంటారంటూ ఓ విలేకరి దీనిపై సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీని పాదయాత్ర సమయంలో కోరారు.

ఆ సమయంలో పక్కనే ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఇప్పుడు  ఆ విషయం అంటూ వారించారు. దీనికి రాహుల్ గాంధీ ఒప్పుకోకుండా ఇంగ్లీషులో మీతో మాట్లాడుతానంటూ పెట్టుబడుల అంశంపై వివరంగా పేర్కొన్నారు. రూ. 60వేల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తుంటే ఏ ముఖ్యమంత్రి అయిన తిరస్కరించడం కరెక్ట్ కాదన్నారు. సిద్ధాంతాలను పేర్కొనే సమయంలో కార్పొరేట్లకు తాను వ్యతిరేకం కాదన్నారు. కేవలం గుత్తాధిపత్యాన్ని నేను ప్రశ్నిస్తుంటానని వ్యాఖ్యానించారు. కొన్ని సంస్థలు గుత్తాధిపత్యం సాధిస్తే, దేశం బలహీన పడుతుందని చెప్పారు.

రాజస్థాన్‌లో అదానీ గ్రూప్ కు సహాయపడేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ అధికారాన్ని ఉపయోగించలేదని, ఒకవేళ అలా చేసిననాడు తాను వ్యతిరేకిస్తానని చెప్పారు.

అదానీ గ్రూప్ రాజస్థాన్‌లో రూ.65 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతోందని ఆ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ పేర్కొనివున్నారు. దీనివల్ల 40,000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతారని పేర్కొన్నారు. రానున్న ఐదేళ్ళ నుంచి ఏడేళ్ళలో 10,000 మెగా వాట్ల సౌర విద్యుదుత్పాదన కర్మాగారం, సిమెంట్ ప్లాంట్ విస్తరణ, జైపూర్ విమానాశ్రయం ఆధునికీకరణ వంటి ప్రాజెక్టులను చేపడతామన్నారు. ఈ వివరాలను ‘ఇన్వెస్ట్ రాజస్థాన్, 2022’ సదస్సులో ఈ నెల 7న ప్రకటించారు. ఆ సందర్భంలో అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ, అదానీని ‘గౌతమ్ భాయ్’ అని సంబోధించి ఉన్నారు.

ఇది కూడా చదవండి: Digital Rupee: డిజిటల్ రూపాయి (ఇ-రూపీ)పై ఆర్బీఐ తీపి కబురు

ఇవి కూడా చదవండి: