Home / Pushpa 2
పుష్ప: ది రైజ్ సూపర్ సక్సెస్ తర్వాత, అల్లు అర్జున్ మరియు సుకుమార్ పూర్తిగా పుష్ప: ది రూల్ పై దృష్టి పెట్టారు. ప్రీ-ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తయింది మరియు షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు సుకుమార్ తన కుటుంబంతో హాలిడేలో ఉన్నాడు.
పుష్ప 2 షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సీక్వెల్లో కూడా ప్రధాన తారాగణం వారి వారి పాత్రలను వారే పోషిస్తారు. ఇలా ఉంటే, ఈ సినిమా కోసం నిర్మాతలు మరో విలన్ ను ఎంపిక చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
దేవీ శ్రీ ప్రసాద్ పుష్ప 1 లో చూపే బంగారమయ్యేనా శ్రీవల్లి అంటూ ఆ పాటతో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. మళ్ళీ అందరితో ఊ అంటావా మావ ఊ ఊ అంటావా అంటూ ఐటెం పాటకు పిచ్చ క్రేజును తీసుకొచ్చారు .
దర్శకధీరుడు రాజమౌళి భారతదేశంలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఫిల్ డైరక్టర్ గా నిలిచాడు."RRR" చిత్రం కోసం అతను సుమారుగా రూ.100 కోట్లను తీసుకున్నాడని సమచారం. రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా రాజమౌళి సినిమా వ్యాపారంలో కూడా వాటా తీసుకుంటున్నాడు.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ సంచలన విజయం సాధించింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా తెరకెక్కిన ఈ చిత్రం 2021లో అతిపెద్ద కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్లు వసూలు చేసింది.