Home / national news
లేడీ సూపర్‌స్టార్ నయనతారకు తమిళనాడు ప్రభుత్వం షాకిచ్చింది. తన సరోగసీ వివాదంపై విచారణ కమిటీ వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన నయనతార-విఘ్నేశ్ శివన్‌లు 5 నెలలు తిరక్కుండానే కవలకు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం జర్నలిస్టు రాణా అయ్యూబ్ సహాయ కార్యక్రమాల కోసం సేకరించిన నిధులలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
బెంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సిల్లీ రీజన్‌తో ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటుంటే చుట్టూ ఉన్న తోటి విద్యార్థులు కూర్చుని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ వారిరువురు కొట్టుకోవడానికి కారణం ఏంటో తెలిస్తే మీరు షాక్ అవ్వక మానరు.
తాను ప్రేమించిన ట్యూషన్ టీచర్‌కు పెళ్లి కుదరడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని అంబత్తూరులో చోటుచేసుకుంది.
హిమాచల్ ప్రదేశ్‌లో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలను చేయనున్నారు.
దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సంకేతాలతో పాటు, రిటైల్ ద్రవ్యోల్బణం, ఐటీ మేజర్ కంపెనీల హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు స్టాక్స్ పై అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఇది పండుగల సీజన్. దేశవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద వేడుగా దీపావళిని చెప్పుకోవచ్చు. అయితే పండుగంటే ఉద్యోగులు ఎవరైనా సెలవు వస్తే బాగుండు కుటుంబంతో గడపాలని చూస్తారు. కానీ, ఉద్యోగులకు పండుగల సమయంలో సెలవు లభించదు. ఈ సందర్భంగా ఓ కంపెనీ తన ఉద్యోగులకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. సర్ప్రైజ్ అంటే ఏ బోనస్సో గిఫ్ట్ లో అనుకుంటున్నారు కదా కాదండి. ఒకటి రెండు రోజులు కాకుండా ఏకంగా 10రోజులు తన ఉద్యోగులకు సెలవులు ఇచ్చింది.
లక్షలాది మంది భారతీయ రైల్వే ఉద్యోగులకు కేంద్రం బుధవారం దీపావళి బహుమతిగా 78 రోజుల బోనస్‌ను ప్రకటించింది.
సామాన్యుడికి ఇస్తున్న సబ్సిడి గ్యాస్ ధరలతో చమురు సంస్ధలు నష్టాల్లోకి జారుకొన్నాయి. ఈ నేపధ్యంలో చమురు సంస్ధల నష్టాలను పూడ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.
సరోగసి ద్వారానే నయనతార, విఘ్నేశ్ శివన్ తల్లిదండ్రులయ్యారనే వార్తలు రావడంతో తీవ్ర దూమారం రేగింది. ఈ క్రమంలో తాజాగా విఘ్నేశ్ ఇన్‌స్టా స్టోరీస్‌లో చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.