Home / national news
అధికార భాష పై పార్లమెంటరీ కమిటీ సమర్పించిన నివేదిక పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆదివారం న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో (రీసెర్చ్ అండ్ రిఫరల్) కంటిశుక్లం ( కాటరాక్ట్) శస్త్రచికిత్స విజయవంతమైందని రాష్ట్రపతి భవన్ అధికార ప్రతినిధి తెలిపారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై విజిలెన్స్ విచారణకు సంబంధించి అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఏఐజీ) మన్మోహన్ కుమార్‌కు రూ. 50 లక్షలు లంచం ఇవ్వజూపిన పంజాబ్ మాజీ మంత్రి సుందర్ షామ్ అరోరా ను పంజాబ్ విజిలెన్స్ బ్యూరో అరెస్టు చేసింది.
దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు గుప్పించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. కేసులో ప్రధాన నిందితుడుగా సీబీఐ నమోదు చేసిన వారిలో ఒకరైన ఢిల్లీ ఆప్ పార్టీ కీలక నేత, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్‌కు చెందిన రెండు డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు. ఈ రెండింటిలో ఒకటి శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లోని ఎస్ఎస్ఐ బ్రాంచ్ కాగా, మరొకటి జమ్మూలోని చన్నీరామ బ్రాంచ్.
తీవ్రవాదులతో సంబంధాలు కలిగివున్నందుకు జమ్ము కశ్మీర్ లో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసు నుండి తొలగించారు. నివేదికల ప్రకారం, ఉద్యోగులు నార్కో-టెర్రర్ సిండికేట్‌ను నడుపుతున్నారు మరియు ఉగ్రవాద దాడులను నిర్వహించడానికి నిషేధిత సంస్థలకు సహాయం చేస్తున్నారు.
శనివారం జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో పండ్ల తోటలకు వెళుతున్న పూరన్ క్రిషన్ అనే కాశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపినట్లు అధికారులు తెలిపారు.
ఈ పటాకులను చూస్తే మాత్రం కాల్చకుండా అమాంతం నోట్లో వేసుకుంటాం. అదేంటి టపాసులను నోట్లో వేసుకోవచ్చు అంటున్నారు.. పటాకులు విషపూరితం కదా అనుకుంటున్నారు కదా.. కాదండీ ఈ టపాసులు మాత్రం తియ్యతియ్యగా నోటిలో వేస్తే కరిగిపోతాయి. మరి వాటి విశేషాలేంటో తెలుసుకుందామా..
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ను విడుదల చేయాలన్న బాంబే హైకోర్టు ఉత్తర్వలను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది.
ఓ టీచర్ చేసిన అనాలోచిత పని వల్ల ఓ విద్యార్థిని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. పరీక్షల్లో కాపీయింగ్ చేస్తుందంటూ విద్యార్థిని అనుమానించిన టీచర్.. ఆ బాలికపై చేసిన పని ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. దీనితో ఒంటికి నిప్పంటించుకొని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని జమ్షెడ్పూర్లో జరిగింది.