Home / national news
కరోనా ప్రభావం తగ్గిందనుకున్న ప్రతీ సారీ నేనున్నానంటూ ఎక్కడో దగ్గర తన ఉనికి చాటుకుంటూనే ఉంది కొవిడ్-19. కరోనా మరోసారి దాని విజృంభణను కొనసాగిస్తోంది. కరోనా వేరియంట్లలో అత్యంత ప్రమాదరక, వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలున్న ఎక్స్ఎక్స్ బీ వేరియంట్‌ను శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
దేశవ్యాప్తంగా 75,000 మంది యువతకు దీపావళి కానుకగా ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 22న యువకులకు వారి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేయనున్నారు.
ఐఐటీలో చేరాలని కలలు కన్న యువకుడు చివరికి ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కి కీలక రిక్రూటర్‌గా మారాడు. బుధవారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) వారణాసిలో అరెస్ట్ చేసిన బాసిత్ కలాం సిద్దిఖీ జీవితాన్ని విధి మలుపు తిప్పింది.
కూలర్‌ను ఎందుకు ఆఫ్ చేశారని అడిగినందుకు అక్కడి మహిళ ఓ వ్యక్తిపై చెప్పుతో దాడి చేసింది. అతన్ని తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి తన్ని తరిమేసింది. ఈ ఘటన అంబికాపూర్ మెడికల్ కాలేజీలో చోటుచేసుకుంది. కాగా ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గుజరాత్ కెవాడియాలోని ఏక్తా నగర్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద మిషన్ లైఫ్ (పర్యావరణానికి జీవనశైలి)ని ప్రారంభించారు.
ఉత్తరప్రదేశ్‌లోని అనేక నగరాల్లో డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించిన వైద్యులు మరియు పారామెడికల్ సిబ్బందికి సెలవులు ఇవ్వరాదని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.
పెళ్లి అనగానే సాధారణంగా కట్నం ఎంత అని అడుగుతుంటారు. వధువు కుటుంబ సభ్యులు వరుడికి కట్నకానుకలు సమర్పించడం అనాది కాలంగా వస్తోన్న ఆచారం. ఎవరి స్థాయికి తగినట్టుగా వారు వరుడికి వివిధ వస్తువులు, నగదు, బంగారం రూపేణా కట్నాలు సమర్పించుకుంటారు. అయితే ఒక ప్రాంతంలో వింత ఆచారం కొనసాగుతుంది వరుడికి కట్నం కింద వారు పాములు ఇస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం.
దీపావళి పండుగకు ముందు ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణ కాలుష్యం కారణంగా బాణసంచా క్రయవిక్రయాలు, ఉపయోగించటం పై నిషేధం విధించింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా బెంగళూరును వర్షాలు ముంచెత్తాయి. ఐటీ నగరి, కర్ణాటక రాజధాని అయిన బెంగళూరు ఇటీవల కురిసిన వర్షాల ధాటికి నీటమునిగింది. దానితో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కకుని ఉన్నాయి.
నేటి యువత కళాశాలకు వెళ్లాలంటే అబ్బో మాములుగా రెడీ అవుతారా చెప్పండి. దువ్విన తలనే దువ్వడం అద్దిన పౌడర్ అద్దడం అద్దం వదలకపోవడం ఈపాట గుర్తొస్తుంటది వీళ్లు కాలేజీలకు వెళ్లేటప్పుడు స్టంట్స్ చూస్తుంటే.. కానీ ఈ యువకుడు మాత్రం అందుకు భిన్నం అని చెప్పవచ్చు.