Home / national news
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సాక్షులను ఆయన బెదిరిస్తున్నారని సీబీఐ తన పిటిషన్ లో పేర్కొంది. పదే పదే డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ ఆరోపించింది.
తమిళనాడులోని తిరుచిరాపల్లిలో హిందూ జనాభా అధికంగా ఉన్న ఏడు గ్రామాలను వక్ఫ్ బోర్డు తమ సొంత గ్రామాలుగా పేర్కొంది. ఇది మాత్రమే కాదు. 1500 సంవత్సరాల పురాతన దేవాలయం పై కూడా తమదే అని చెబుతోంది.
అతను ఏ లాటరీ టికెట్టు కొనలేదు.. ఆన్లైన్ ట్రేడింగ్ చెయ్యలేదు కానీ కోటీశ్వరుడయ్యాడు. అదెలా అనుకుంటున్నారా... బ్యాకింగ్ సేవల్లో పొరపాటు వల్ల ఓ వ్యక్తి ఒక్కరోజు కోటీశ్వరుడయ్యాడు. ఈ ఘటన అహ్మదాబాద్ లో జరిగింది.
దేశంలోనే తయారయ్యే సెమీకండక్టర్లు వల్ల ల్యాప్‌టాప్‌ల ధరలు భారీగా తగ్గుతాయని వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ తెలిపారు. దీని ద్వారా ప్రస్తుతం మార్కెట్లో లక్షల్లో పలుకుతున్న ల్యాప్ ట్యాప్ ధరలు వేలల్లో కొనుగోలు చెయ్యవచ్చన్నారు.
రానురాను మన దేశంలో చిరుతలు అంతరించిపోతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఓ ఆలోచన చేశారు. విదేశాల నుంచి చీతాలను తీసుకొచ్చే పనికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే నమీబియా దేశం నుంచి 8 చీతాలను దేశానికి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమయ్యింది.
తమిళనాడు దేవాలయాల్లో అశ్లీలత డాన్సులు, సినిమా పాటలకు మద్రాసు హైకోర్టు చెక్ పెట్టింది. ఆలయాల్లో అశ్లీలతకు చోటులేకుండా భక్తి గీతాలే ఉండాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓ సామాజిక కార్యకర్త హైకోర్టును ఆశ్రయించడంతో ఈ మేరకు నిషేదం విధిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొనింది
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని ఒక కార్మికుడు యజమాని తనకు చెల్లించవలసిన మొత్తాన్ని పూర్తిగా ఇవ్వలేదంటూ కోటి రూపాయల మెర్సిడెస్ కారుకు నిప్పు పెట్టాడు. రణ్వీర్ అనే కార్మికుడు ఒక ఇంట్లో టైల్స్ అమర్చాడు.
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ తలపెట్డిన భారత్ జోడో యాత్రకు నేడు విరామం ఇచ్చారు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు దళిత మైనర్ అక్కాచెల్లెళ్ల మృతదేహాలు ఊరి చివర చెట్టుకు వేలాడుతూ అనుమానాస్పద రీతిలో కనిపించాయి.
ఏ వేడుకలైనా ఎవరికీ హానీ కలుగనంతవరుకే ఆనందంగా ఉంటాయి. కానీ సృతిమించితే అనేక అనర్ధాలకు దారి తీస్తాయి. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో ఒకటి చోటుచేసుకుంది. గణనాథుని వేడుకలలో దాదాపు 65 మంది చూపు పోగొట్టుకున్నారు.