Home / Nara Chandrababu Naidu arrest
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు. చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని పేర్కొన్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ నెల 21న సమావేశాలు ప్రారంభమవ్వగా.. 27వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. దాంతో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పరిస్థితి మారి మాటల యుద్ధానికి నేతలు సై అంటున్నారు.
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకి ఊహించని షాక్ తగిలింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ ఇవాళ్టితో ముగియనుంది. దీంతో చంద్రబాబును వర్చువల్ గా ఏసీబీ కోర్టు ముందు హాజరుపర్చారు సీఐడీ అధికారులు. కాగా ఈ క్రమం లోనే చంద్రబాబునాయుడు రిమాండ్ ను ఈ నెల 24వ తేదీకి పొడిగించింది కోర్టు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టైన సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే చంద్రబాబును సెంట్రల్ జైలుకు పంపించినప్పటి నుంచి ఆయన భద్రతపై టీడీపీ లీడర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ములాఖత్ తర్వాత చంద్రబాబుతో మాట్లాడిన భువనేశ్వరి
ఏపీ అసెంబ్లీలో నేడు మాటల వైసీపీ, టీడీపీ నాయకుల మాటల యుద్ధానికి తెర లేపింది. కాగా చంద్రబాబు అరెస్టు విషయంపై మొదలై తెదేపా నేతలను సస్పెండ్ చేసే వరకు వచ్చింది. అయితే సస్పెన్షన్ అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి అంబటి రాంబాబు తన వృత్తిని అవమానిస్తేనే తాను రియాక్ట్ కావాల్సి వచ్చిందని
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తాజాగా ప్రారంభమయ్యాయి. కాగా సభ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే అసెంబ్లీలో రచ్చ మొదలయ్యింది. చంద్రబాబు అరెస్ట్ పై చర్చ జరపాలని టీడీపీ నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఫ్లకార్డులు ప్రదర్శించారు. కాగా టీడీపీ డిమాండ్ పై చర్చకు సిద్ధంగా ఉన్నామని.. బీఏసీలో దీనిపై చర్చించి నిర్ణయం
చంద్రబాబు బయటికి వస్తే వైసీపీ అంతం తప్పదని నారా బ్రాహ్మణి అభిప్రాయపడ్డారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో భువనేశ్వరితో పాటు బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతోనే
ఏపీ సీఎం జగన్.. తాజాగా వైఎస్సార్ కాపు నేస్తం నాలుగో విడత నిధులను బటన్ నొక్కి రిలీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొని బటన్ నొక్కి 3 లక్షలా 57 వేల మందికి పైగా మొత్తం 537 కోట్ల రూపాయల వైయస్సార్ కాపు నేస్తం నిధులను అందించారు. ఈ క్రమంలో అర్హులైన 3,57,844 మంది
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టైన సంగతి తెలిసిందే. గత శనివారం అరెస్టైన చంద్రబాబు వారం రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన అరెస్ట్ పై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం చెలరేగింది. ఆయనకు ఈ కేసులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై
రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసిన అనంతరం లోకేశ్ తో కలిసి నందమూరి బాలకృష్ణ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై దెబ్బకు దెబ్బ... వేటుకు వేటే అంటూ సమరశంఖం పూరించారు. కేసులకు భయపడాల్సింది తాము కాదని, వైసీపీ నేతలేనని అన్నారు.