Home / Mangalagiri
పవన్ పర్యటనతో పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. వైసీపీ నుంచి పలువురు కార్యకర్తలు ఆ పార్టీని వీడి బయటకు వచ్చేస్తోన్నారు. పలువురు ఉత్సాహవంతులు, యువ కార్యకర్తలు పవన్‌తో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పటంలో ఇళ్ల కూల్చి తన గుండెళ్లో గునపం దింపారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 2024లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తాం అని సవాల్ విసిరారు. కూల్చివేతలో అధికారులు పద్ధతి పాటించలేదని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పరిహారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం తనను బాధించిందని ఆయన తెలిపారు.
త్వరలో మంగళగిరి ఎయిమ్స్ ( ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించనున్నట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు.
ఏపీలో జనసేన మంచి స్పీడుతో దూసుకెళ్తోంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో అధికార వైసీపీని ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగానే వరుస కార్యక్రమాలతో జనసైనికుల్లో జోష్ నింపుతున్నారు పవన్. ఇకపోతే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో నేడు పీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు.
ఆటమొదలైయ్యింది ఇంక కాస్తోండి. మీరు ఒకటి చేస్తే నేను అంతకు రెట్టింపు చెయ్యగలను. జనసైనికులను ఏరా, ఓరేయ్ అంటే ఉన్నచోటే వైసీపీ నేతలను ఈడ్చి కొట్టండి అంటూ జనసేనాని కార్యకర్తలకు తెలిపారు. సైలెంట్‌గా ఉంటున్నాం కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నా కన్నతల్లిని, చిన్నారులను తిట్టడం ఏంటిరా మీ సంస్కరహీనానికి హద్దులేదా అంటూ వైసిపిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిట్టిపోశారు. తనకు భాష రాదనుకొంటే పొరపాటన్నారు. మంగళగిరి సభలో వైకాపా నేతల తీరును ఆయన ఎండగట్టారు.
మరొక్క సారి ప్యాకేజ్ స్టార్ అని నన్ను అంటే వైకాపా శ్రేణులను చెప్పుతో కొడతానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. దవడ వాచిపోయేలా కొడతానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు
జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరి వేదికగా వైసీపీ నేతలను బండబూతులు తిట్టాడు. విశాఖ జిల్లాలో జరిగిన జనసేనాని పర్యటనలో జరిగిన అనేక అవమానాల నేపథ్యంలో ఆయన ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు ఎదుట చాలా ఆగ్రహావేశానికి గురయ్యారు. చవట సన్నాసుల్లారా, దద్దమ్మళ్లారా నేను తిట్టలేను అనుకుంటున్నారా అంటూ చెప్పు చూపిస్తూ అధికార పార్టీ నాయకులపై వీరలెవెల్లో మండిపడ్డారు.
జనసేన ఛలో మంగళగిరి కార్యక్రమానికి శ్రీకారం. జగన్ రెడ్డి అకృత్యాలను ప్రశ్నిద్దామని పిలుపు. వైసీపి రౌడీ రాజకీయాలకు వ్యతిరేఖంగా పోరాడనున్న జనసేన.
ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ యాత్రలు వాయిదా పడుతున్నాయి. తెలుగుదేశం కీలక నేత నారా లోకేష్ ఆధ్వర్యంలో వచ్చే నెలలో ప్రారంభం కావాల్సిన పాద యాత్రను జనవరి నెలకు వాయిదా వేసిన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా నటుడు పవన్ కళ్యాణ్ అక్టోబర్ నుండి తాను చేపట్టనున్న జనసేన యాత్ర వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.