Home / latest tollywood news
దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ పోషించిన యశోద మూవీ మరో రెండు రోజుల్లో విడుదలకాబోతుంది. 11 నవంబర్ 2022న దేశవ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తమ అనుభవాలను నెట్టింట షేర్ చేసుకున్నారు.
దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. లవ్, థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా సినిమా గురించి హీరోయిన్ జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడింది.
Samantha Ruth Prabhu breaks down: మైయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో తన పోరాటం గురించి మాట్లాడుతూ సమంత రూత్ ప్రభు భదాపడింది.
బింబిసారతో హిట్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్ ఎట్టకేలకు మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం పలు ఆసక్తికర ప్రాజెక్టులతో బిజీగా ఉండగా ఇప్పటికే రెండు సినిమాలను లైన్లో పెట్టాడు.
ప్రణవచంద్ర, మాళవిక సతీషన్,మాస్టర్ చక్రి, అజయ్‌ఘోష్, బిత్తిరి సత్తి ముఖ్యపాత్రల్లో కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, బెనర్జీ అతిధి పాత్రలలో నటించిన చిత్రం దోచేవారెవురా. ఈ సినిమాను ఐక్యూ క్రియేషన్స్ పతాకంపై బొడ్డు కోటేశ్వరరావు నిర్మించగా శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలోని ‘‘సుక్కు,సుక్కు ..’’ సాంగ్‌ను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు.
మధ్యప్రదేశ్ లో పర్యాటకాన్ని (టూరిజం) ప్రోత్సహించేందుకు మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్ (MPTB) తమ రాష్ట్రంలో కనీసం యాభై శాతం షూటింగ్ (ఇండోర్/ఔట్ డోర్) జరుపుకునే చిత్రాలకు గరిష్టంగా కోటిన్నర నుంచి రెండు కోట్లు వరకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తోంది.
రామ్ చరణ్,ఉపాసన కొంత విరామం దొరికితే విదేశాలకు వెళ్లి అక్కడ సరదాగా గడిపేస్తుంటారు. ఇటివల వాళ్లిద్దరూ 'టాంజానియా'లో షికారు చేసి అక్కడ తమకి నచ్చిన ఒక లొకేషన్లో ఫోటోలు దిగారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నేటింట్లో వైరల్ అవుతున్నాయి.
నేటి సినిమా రంగంలో అశ్లీలత పెరిగి కుటుంబసమేతంగా సినిమాలు చూడలేని పరిస్ధితి ఏర్పడింది. దీంతోపాటు ఆధ్యాత్మిక అంశాలకు సైతం అశ్లీలత జోడించి డబ్బులు సంపాదించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటనను నిరసిస్తూ హైదరాబాదు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు అందింది.
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 2లో మెరిసిన బుల్లితెర భామ భానుశ్రీ. డాన్సర్‌గా, యాంకర్‌గా, యాక్టర్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. మల్టీటాలెంట్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది భాను. తాజాగా హాట్ ఫోటోస్‌తో సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. తాజాగా భానుశ్రీ షేర్ చేసిన ఫోటోలు మీకోసం
టాలీవుడ్ బ్యూటీ స్నేహ అసలు పేరు సుహాసిని రాజారాం. ఈ బ్యూటీ 1981 అక్టోబరు 12న ముంబైలో జన్మించారు. ఈమె గోపిచంద్ హీరోగా నటించిన "తొలివలపు" చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తరుణ్ సరసన "ప్రియమైన నీకు" చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత సంక్రాంతి, వెంకీ, రాధాగోపాలం, శ్రీరామదాసు వంటి సినిమాలు చేసి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది. ఈ అందాల తార తమిళ నటుడు ప్రసన్నను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు.