Home / latest Telangana news
కాంగ్రెస్ బస్సుయాత్ర తుస్సుమనడం ఖాయమని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ అని ఆయన కొనియాడారు. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని ఎద్దేవా చేశారు. గత పదేళ్ల కాలంలోగిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నించారు.
ప్రజల ఆకాంక్షలను గుర్తించి తెలంగాణ ఇచ్చామని, అయితే ప్రత్యేక రాష్ట్రం వచ్చినా సామాజిక న్యాయం దక్కలేదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆమె ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని బంగారు తెలంగాణ అంటూ ప్రజలను మోసం చేసారని ధ్వజమెత్తారు.
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకులు మాటల యుద్దానికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ఓ అంశం పట్ల బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య మాటల యుద్దం జరుగుతుంది. తెలంగాణలో రైతు కుటుంబాలకు
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే అవకాశాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో టీబీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బి.జె.పి. ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె.లక్ష్మణ్ చర్చలు జరిపారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.
ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాలు విసిరారు. దమ్ముంటే గోషా మహల్ లో ఎం.ఐ.ఎం అభ్యర్థిని నిలబెట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థికి లబ్ధిచేకూర్చేందుకు ఎం.ఐ.ఎం అభ్యర్థిని గోషామహల్ నుంచి నిలబెట్టడం లేదని రాజాసింగ్ ఆరోపించారు.
తెలంగాణ శాసన సభ ఎన్నికలలో జనసేన పోటీ చేయవలసిందేనని జనసేన తెలంగాణ నాయకులు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని జనసేన తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయంలో మంగళవారం రాత్రి జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగం కాంగ్రెస్ బస్సు యాత్ర రేపటినుంచి ప్రారంభం కానుంది. ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బస్సు యాత్రని లాంఛనంగా ప్రారంభిస్తారు.రేపు సాయంత్రం 4 గంటలకు రామప్ప దేవాలయాన్ని రాహుల్, ప్రియాంక దర్శించుకుంటారు. ఆరు గ్యారంటీలను శివుడి ముందు పెట్టి పూజలు చేస్తారు
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా ఈరోజు మరో 28 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. అనంతరం జనగామలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే చేర్యాలను
జనసేన - టీడీపీ అధికారంలోకి రావాలని జనసేన నేత బాలాజీ స్కూటర్ యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తాజాగా మీడియాతో సమావేశం ముచ్చటించారు.
తెలంగాణలో ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో ఆయా పార్టీలు ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే అధికార బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారమే లక్ష్యంగా సన్నాహాలు చేపడుతుంది. ఈ క్రమం లోనే నేడు జనగామలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ జనగామ జిల్లాకు వరాల జల్లు కురిపించారు.