Home / latest political news
Delhi Liquor Scam: దాదాపు 8 గంటలుగా విచారణ కొనసాగుతోంది. ఈడీ ఆఫీస్‌లోని మూడో ఫ్లోర్‌లో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కొద్ది నిమిషాల క్రితం కవిత లీగల్ టీం ఈడీ కార్యాలయానికి చేరుకుంది. ఈడీ పిలుపు మేరకు లీగల్ టీం అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
Nara Lokesh: ఇటీవలే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీకి పట్టభద్రులు తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలే పునారవృతం అవుతాయని వెల్లడించారు.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దాదాపు తెలిసిపోయాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం ఈ ఎన్నికల్లో రుజువైందని గంటా విశ్లేషించారు. రాజధాని వ్యవహారం సహా వైసీపీ చెప్పిన మాటలకు ప్రజల్లో విశ్వాసం లభించలేదన్నారు. మూడేళ్ల క్రితం దాదాపు 50 ఓటింగ్ సాధించిన వైసీపీ ఇప్పుడు 30శాతంకు పడిపోయిందన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. ఈ నెల 13న ఏపీ లోని 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు తెలంగాణలోని ఒక ఉపాధ్యాయ స్థానంలో ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం ఉదయం 8 గంటల నుంచి అధికారులు ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు.
నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డికి బాలయ్య మాస్ వార్నింగ్ ఇచ్చారు. పొలిటీషియన్ పొలిటీషియన్‌గానే ఉండాలని సూచించారు. నీచానికి దిగజారకు అంటూ శ్రీనివాసరెడ్డిని ఘాటుగా హెచ్చరించారు. ఈ సందర్భంగా తాజాగా ఓ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. సినిమా పాటలకు రాజకీయాలను ఆపాదించడం ఏంటని మండిపడ్డారు.
టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోగా ఉండి.. కోట్లలో రెమ్యునరేషన్స్ తీసుకుంటూ.. లెక్కలేనంత అభిమాన సముద్రాన్ని సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. కాగా సమాజానికి ఏదైనా చేయాలి.. ప్రజలకు తోడుగా నిలవాలి అనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ ఏర్పడి నేటికి 10 సంవత్సరాలు అవుతుంది. ప్రశ్నించడం కోసమే అంటూ ప్రజల పక్షాన నిలబడి వారికి అండగా ఉంటున్నారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నాడు తాజాగా ప్రారంభమయ్యాయి. ఏపీ రాష్ట్ర గవర్నర్ గా అబ్దుల్ నజీర్ ఇటీవలనే బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన అబ్దుల్ నజీర్ ఇటీవలనే రిటైర్ అయ్యారు. సుప్రీంకోర్టు జడ్జిగా రిటైరైన వెంటనే ఏపీ గవర్నర్ గా నజీర్ ను నియమిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం జరిగే ఎన్నికల కోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ విదేశాల్లో సైతం కోట్లలో అభిమానులను సంపాదించుకున్నారు రజినీ. ఆయన స్టయిల్, డైలాగ్ డెలివరీ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా నిలిచి విదేశాల్లో కూడా మంచి మార్కెట్ ఉన్న స్టార్ అంటే రజినీ అనే చెప్పాలి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ఇప్పుడు తాజాగా వార్తల్లో నిలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే బీజేపీ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు కోడైకూస్తున్నాయి. ఈ మేరకు కిరణ్ కుమార్ ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు చర్చలు జరిపినట్టుగా సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.