Home / latest national news
కుండపోత వర్షాల కారణంగా అసోంలో అనేక నదులు. నీటి మట్టాలు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి . దీనితో వరదల కారణంగా 20 జిల్లాల్లో దాదాపు 1.20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) నివేదికల ప్రకారం అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) వరద నివేదిక ప్రకారం, బక్సా, బార్పేట, దర్రాంగ్, ధేమాజీ, ధుబ్రి, కోక్రాఝర్, లఖింపూర్, నల్బారి, సోనిత్పూర్ మరియు ఉదల్గురి జిల్లాల్లో 1,19,800 మందికి పైగా ప్రజలు వరద బారిన పడ్డారు.
తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీకి బుధవారం ఉదయం కావేరి ఆసుపత్రిలో హార్ట్ కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ జరిగింది. ఆపరేషన్ తర్వాత మంత్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాత్మక సంఘటనల నేపధ్యంలో శాంతిభద్రతలకు మరింత విఘాతం కలగకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్పై నిషేధాన్ని జూన్ 25 వరకు మరో ఐదు రోజులు పొడిగించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న అశాంతి దృష్ట్యా డేటా సేవలను నిషేధించిన విషయం తెలిసిందే.
కోవిడ్ సెంటర్ స్కామ్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ముంబై మరియు సమీప ప్రాంతాలలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.పరిశీలనలో ఉన్న సంస్థ లైఫ్‌లైన్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ సర్వీస్ లిమిటెడ్, శివసేన (UBT) నాయకుడు సంజయ్ రౌత్ సన్నిహితుడు సుజిత్ పాట్కర్‌తో సంబంధం కలిగి ఉంది.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జగన్నాథ రథయాత్ర మంగళవారం ఒడిశాలోని పూరీలో పవిత్రమైన ‘పహండి’ ఆచారాలతో ప్రారంభమైంది. జగన్నాథుని రథయాత్ర ఉత్సవానికి దాదాపు 25 లక్షల మంది ప్రజలు వస్తారని శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ (ఎస్జెటిఎ ) అంచనా వేసింది.
బాలాసోర్ రైలు ప్రమాదంపై విచారణ జరుపుతున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సోమవారం బాలాసోర్‌లోని సోరో సెక్షన్ సిగ్నల్ జూనియర్ ఇంజనీర్ ఇంటికి సీలు వేసింది. బాలాసోర్‌లోని అద్దె ఇంట్లో నివసించిన ఇంజనీర్‌ను దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది. అయితే అతను ఇప్పుడు తన కుటుంబంతో అదృశ్యమయ్యాడు.
అమర్నాథ్ యాత్రలో పాల్గొనేందుకు ఎక్కువ మందిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో, హోటల్స్ బుకింగ్ గదులపై అదనపు తగ్గింపులను అందించాలని ఆల్ జమ్మూ హోటల్స్ అండ్ లాడ్జెస్ అసోసియేషన్ నిర్ణయించింది.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన పబ్లిషర్ గీతా ప్రెస్‌కి 2021కి గాను గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఈరోజు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని జ్యూరీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అపహస్యంగా పేర్కొన్నారు.
చెన్నై నగరంలో ఆదివారం అర్దరాత్రినుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలతో వేలచేరి, గిండి, వేపేరి, జిఎస్టి రోడ్ మరియు కెకె నగర్ వంటి లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోయింది. చెన్నై విమానాశ్రయంలో దిగాల్సిన పది విమానాలను సోమవారం తెల్లవారుజామున బెంగళూరు విమానాశ్రయానికి మళ్లించగా, 17 అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
: లక్నోలోని నిగోహన్ రైల్వే స్టేషన్లో శనివారం తీవ్రమైన వేడి కారణంగా లూప్‌లైన్‌లోని రైల్వే ట్రాక్‌లు కరిగిపోవడంతో పెద్ద రైలు ప్రమాదం తప్పింది.శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ మెయిన్ లైన్‌కు బదులుగా లూప్ లైన్ గుండా వెళ్లడంతో ట్రాక్‌లు కరిగిపోయి వ్యాపించడంతో ఈ ఘటన జరిగింది.