Home / latest international news
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ప్రయాణీకుల బస్సు లోయలో పడటంతో 20 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. బస్సు పంజాబ్‌లోని రావల్పిండి ప్రావిన్స్ నుండి హుంజాకు వెళ్తుండగా గిల్గిట్-బాల్టిస్తాన్లోని డయామర్ జిల్లాలోని కారకోరం హైవేపై డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు.
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ గురించి తరచూ ఆశ్చర్యకరమైన విషయాలను వింటుంటాం. అయితే ఈ సారి మాత్రం మరో దిగ్ర్భాంతికరమైన విషయాలను ఉత్తర కొరియా నుంచి తప్పించుకొని వచ్చిన యోన్మి పార్క్ అనే మహిళ బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. ఈ విషయాలను బ్రిటిన్‌కు చెందిన మిర్రర్ అనే పత్రిక ప్రచురించింది
:యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌ను వరదలు ఒక పట్టాన వదిలేట్టు కనిపించడం లేదు. గత నెల దుబాయిలో గత 70 ఏళ్లలో ఎన్నడూ కురవని విధంగా భారీ వర్షాలు దుబాయిని అతలాకుతలం చేశాయి. జనజీవనం అస్తవ్యస్తం అయిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం ఉదయం మరో మారు అబుదబితో పాటు దుబాయిని భారీ వర్షాలు ముంచెత్తాయి.
కెన్యాలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలోని మై మహియు ప్రాంతంలో ఉన్న ఓల్డ్ కిజాబే డ్యామ్ కూలిపోయింది. దీనితో వరదలు సంభవించి రహదారులు ధ్వంసమవడమే కాకుండా 45 మంది మరణించారు. ఈ సంఘటన నేపధ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డ్యాములు, రిజర్వాయర్లను తనిఖీ చేయాలని అంతర్గత మంత్రి కితురే కిండికి అధికారులను ఆదేశించారు.
కెనడాలో సిక్కుల హవా ఎలా నడుస్తుందో చెప్పడానికి ఇదో చక్కటి ఉదాహరణ. అక్కడ ప్రభుత్వం బతికి బట్టకట్టాలంటే సిక్కుల మద్దతు తప్పనిసరి. అయితే ఆదివారం టోరంటోలో ఖల్సా డే సంబరాలు జరిగాయి. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో సమక్షంలో ఖలిస్తాన్‌కు అనుకూలంగా.. అలాగే ప్రతిపక్ష నాయకుడు పియర్ పోయిలీవ్రేకు మద్దతుగా నినాదాలు చేశారు
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం ప్రపంచదేశాలపై పడుతోంది. ఎర్ర సముద్రం ద్వారా వచ్చే నౌకలను హౌతీ మిలిటెంట్లు దాడులకు తెగబడ్డం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతోంది. ఇజ్రాయెల్ - గాజా మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో హౌతీలు గాజాకు మద్దతు తెలుపుతూ ఈ రూట్లలో వెళ్లి నౌకలను హైజాక్ చేయడం.. వాటిని విడిపించేందుకు బేరసారాలు చేస్తూ డబ్బు దండుకుంటున్నారు.
తాలిబన్ల పాలనలో ఆఫ్గానిస్తాన్‌లో మహిళలు, బాలికల పరిస్థితి దారుణంగా తయారైందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. బాలికల ఆశలతో పట్ల ఆఫ్గానిస్తాన్ శ్మశాన వాటికలా తయారైందని టోలోన్యూస్ వెల్లడించింది. ఇక ఆఫ్గాన్ బాలికలు తమ హక్కుల కోసం ప్రధానంగా విద్య హక్కు కోసం పోరాడుతున్నారు. బాలికల విద్య పట్ల నిషేధం ఉన్నా బాలికలు మాత్రం తమ హక్కు కోసం పోరాడుతున్నారని ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం వెల్లడించింది.
బుర్కినా ఫాసోలో మిలిటరీ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు గ్రామాల్లో సుమారు 223 మందని దారుణంగా చంపారని మానవ హక్కు గ్రూపు తాజాగా ఒక నివేదికలో వెల్లడించింది. ఈ సామూహిక హత్యలు ఫిబ్రవరి 25 నోన్‌డిన్, సోరో గ్రామాల్లో జరిగాయని గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌తో పాటు ఆయన భార్య బుష్రాబీబీ పలు కేసుల్లో జైల్లో ఉన్నారు. అయితే ఖాన్ భార్య బుష్రా బీబీకి జైల్లో ఆహరంలో టాయిలెట్ క్లీనర్ కలిపి ఇస్తున్నారని ఆమె అధికారి ప్రతినిధి ఆరోపించారు. అయితే దీనిపై కోర్టు మెడికల్ టెస్ట్‌లు జరిపించాలని ఆదేశించినా జైలు అధికారులు మాత్రం పట్టించుకోలేదని ఆమె అధికార ప్రతినిధి మషాల్ యుసుఫ్‌జాయ్ చెప్పారు.
కెన్యాలో భారీ వర్షాలకారణంగా ఇప్పటివరకూ 38 మంది మరణించారని కెన్యా రెడ్‌క్రాస్ సొసైటీ ( కెఆర్ సి ఎస్ ) ఒక ప్రకటనలో తెలిపింది. కెన్యా రాజధాని నైరోబీ, మాథారే మురికివాడల్లో బుధవారం రాత్రి కురిసిన వర్షాలతో ఒకరు మరణించగా మరో ఆరుగురు వ్యక్తులు తప్పిపోయారు.