Home / latest international news
మెక్సికోలోని ఓక్సాకా రాష్ట్రంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రయాణీకుల బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోవడంతో ఏడాదిన్నర పసిబిడ్డతో సహా కనీసం 29 మంది మరణించారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు.
ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఒక నెలలోపు బ్యూటీ సెలూన్లు మూసివేయాలని ఆదేశించింది ఆఫ్ఘన్ మహిళలకు బహిరంగ ప్రదేశాలలో ప్రవేశాన్ని కుదించాలని నిర్ణయించినట్లు నైతిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
యునైటెడ్ స్టేట్స్‌లోని ఒక కళాశాల ప్రొఫెసర్ మహిళా విద్యార్థినులను వారి షర్టులను తీసివేయమని కోరినందుకు ఉద్యోగం నుండి తొలగించబడ్డారు. ఈ ఘటనలో విద్యాశాఖ పరిధిలోని పౌరహక్కుల కార్యాలయం విచారణ అనంతరం ఈ చర్య తీసుకుంది.
చైనీస్ బిలియనీర్ అలీబాబా వ్యవస్థాపకుడు మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో రహస్యపర్యటన ప్రస్తుతం పాక్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నేపాల్ నుంచి పలువురు వ్యాపారవేత్తలతో కలసి ప్రత్యేక విమానంలో పాక్‌గడ్డపై దిగారు. మొత్తం 23 గంటల పాటు అక్కడ గడిపారని ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యూన్ వెల్లడించింది.
కెన్యా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమ కెన్యాలోని కెరిచో- నకురు పట్టణాల మధ్య హైవేపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. బాగా రద్దీగా ఉండే జంక్షన్లో ట్రక్కు అదుపు తప్పి ఇతర వాహనాలు, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 48 మంది మృతి చెందినట్లు కెన్యా దేశ పోలీసులు తెలిపారు.
పారిస్‌లోని సబర్బన్ ప్రాంతమైన నాంటెర్రేలో డెలివరీ డ్రైవర్‌ను ఒక పోలీసు అధికారి కాల్చి చంపిన తర్వాత ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు మూడవ రోజుకు చేరుకున్నాయి, ఈ నేపధ్యంలో పోలీసులు దేశవ్యాప్తంగా 400 మందిని అరెస్టు చేశారు.
Dog Nanny Job: మనషులకన్నా కుక్కలకే వాల్యూ ఇస్తున్నారు ఇప్పటికాలం వారు అంటే ఏమో అనుకున్నా భయ్యా కానీ ఇది చూస్తే నిజమే అనిపిస్తుంది. కుక్కను చూసుకునే ఉద్యోగం.. జీతం కోటికి పైగానే అంటే మామూలు లేదకదా. ఏంటీ షాక్ అయ్యారా..? మరి ధనవంతుల కుక్కల రేంజ్ అంటే అంతే ఉంటుంది కదా.
Afghanistan: ప్రపంచంలో విక్రయిస్తున్న నల్లమందు మొత్తంలో కేవలం ఆఫ్ఘానిస్థాన్ దేశంలోనే 80 శాతం నల్లమందు ఉత్పత్తి అవుతోంది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ తాజా నివేదిక వెల్లడించింది.
New York: హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి చాలా ప్రత్యేకం. అందులోని భారతీయుల చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. అయితే విదేశాల్లో ఈ పండుగకు అంత ప్రాధాన్యత లేదు.
Boeing: భారతదేశం లో సంస్థలను వారి ఉత్పత్తులను తయారు చేయుటకు ప్రోత్సహించటానికి యువతకు ఉద్యోగావకాశ కల్పనకు ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి తమ కంపెనీ మద్దతు ఇస్తుందని బోయింగ్ సీఈవో డేవిడ్ ఎల్ కల్హౌన్ పేర్కొన్నారు.