Last Updated:

Kenya Road Accident : కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 48 మంది మృతి

కెన్యా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమ కెన్యాలోని  కెరిచో- నకురు పట్టణాల మధ్య హైవేపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. బాగా రద్దీగా ఉండే జంక్షన్‌లో ట్రక్కు అదుపు తప్పి ఇతర వాహనాలు, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 48 మంది మృతి చెందినట్లు కెన్యా దేశ పోలీసులు తెలిపారు.

Kenya Road Accident : కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 48 మంది మృతి

Kenya Road Accident : కెన్యా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమ కెన్యాలోని  కెరిచో- నకురు పట్టణాల మధ్య హైవేపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. బాగా రద్దీగా ఉండే జంక్షన్‌లో ట్రక్కు అదుపు తప్పి ఇతర వాహనాలు, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 48 మంది మృతి చెందినట్లు కెన్యా దేశ పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు ట్రక్కు కింద చిక్కుకున్నారని అనుమానిస్తున్నట్లు కెన్యా దేశ పోలీసు కమాండర్ జియోఫ్రీ మాయెక్ చెప్పారు.

కాగా ఈ ప్రమాదంలో మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని, వారిని ఆసుపత్రులకు తరలించామని పోలీసులు చెప్పారు. అదుపు తప్పిన ఆ ట్రక్ దాదాపు పలు వాహనాలను ఢీ కొడుతూ వెళ్ళడం వల్లే ఈ విషాదం జరిగినట్లు తెలుస్తుంది.  అయితే కెన్యాలో కురుస్తున్న భారీ వర్షాలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఈ ప్రమాదంపై కెరిఖో కౌంటీ గవర్నర్ ఎరిక్ ముటాయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.