Home / latest international news
ప్రపంచంలోని అగ్రశ్రేణి పర్యాటక ప్రదేశాలలో ఒకటైన వెనిస్ పర్యాటకులకు ప్రవేశ రుసుమును విధించే ప్రణాళికను ప్రకటించింది. యునెస్కో హెచ్చరికల నేపధ్యంలో పర్యాటకులను తగ్గించడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదన వచ్చింది. యునెస్కో వెనిస్ ను ప్రమాదంలో ఉన్న ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చనున్నట్లు తెలిపింది.
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఒక మసీదు సమీపంలో శుక్రవారం జరిగిన 'ఆత్మాహుతి దాడి'లో సుమారుగా 52 మంది మరణించగా 50 మంది గాయపడ్డారు. ఇలాఉండగా ఈ పేలుడుకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు.
:భారత్ లోని యూఎస్ ఎంబసీ గురువారం వరకు రికార్డు సంఖ్యలో ఒక మిలియన్ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసింది. మహమ్మారికి ముందు 2019 కంటే దాదాపు 20% ఎక్కువ దరఖాస్తులను ప్రాసెస్ చేసింది.
పాకిస్థాన్ భారత్ కు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుందని తెలిసిన విషయమే. అదేవిధంగా పాక్ చైనాకు గాడిదలను ఎగుమతి చేస్తుంది. ఇపుడు తాజాగా పాకిస్తాన్ ఎగుమతుల జాబితాలో బిచ్చగాళ్లు చేరారు. అవును.. సౌదీ అరేబియా మరియు ఇరాక్ వంటి దేశాలు ఇప్పుడు బిచ్చగాళ్ల ప్రవాహాన్ని అరికట్టాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరడంతో ఇది వెలుగులోకి వచ్చింది.
ఇరాక్‌లోని ఒక ఫంక్షన్ హాల్లో వివాహం సందర్బంగా జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 100 మందికి పైగా మరణించగా 150 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు.
అజర్‌బైజాన్‌లోని నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంలోని గ్యాస్ స్టేషన్లో జరిగిన పేలుడులో 20 మంది మరణించగా 300 మందిగాయపడ్డారు. వేర్పాటువాద అధికారులు ఈ ప్రాంతం యొక్క అధికారాన్ని అజర్‌బైజాన్‌కు అప్పగించడానికి సిద్ధమవుతున్న సమయంలో ఇది జరిగింది. గాయపడిన వారిలో పలువురి పరిస్దితి ఇంకా విషమంగానే ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.
నైజీరియాలో దుండగులు ఆదివారం చేసిన దాడుల్లో 14మందిని చంపి 60 మందిని అపహరించారు. రాష్ట్రంలోని ఒక విశ్వవిద్యాలయం నుండి పలువురిని కిడ్నాప్ చేసిన రెండు రోజుల తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది.
వెనిజులా లోని ఒక జైలు నుంచి బిట్‌కాయిన్ మైనింగ్ మెషిన్లు,రాకెట్ లాంచర్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనం కలిగిచింది. జైలును తమఆట స్థలంగా,ఒక కొలనుగా,నైట్ క్లబ్ గా మార్చేసిన ముఠానుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు.
పాకిస్థాన్ ఎన్నికల సంఘం (ECP) గురువారం సార్వత్రిక ఎన్నికల తేదీలను ప్రకటించింది. 2024 జనవరి చివరి వారంలో ఎన్నికలు నిర్వహించబడుతాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సంఘం నియోజకవర్గాల విభజనపై పనిని సమీక్షించిందని మరియు నియోజకవర్గాల డీలిమిటేషన్ కోసం ప్రాథమిక జాబితాను సెప్టెంబర్ 27 న ప్రచురించాలని నిర్ణయించినట్లు పాక్ వార్తా సంస్థ డాన్ నివేదించింది.
కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాది మరియు వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అయిన సుఖ్దూల్ సింగ్ సుఖ హత్యకు గురైన దాదాపు గంట తర్వాత, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అతని హత్యకు బాధ్యత వహించింది.