Home / latest international news
బంగ్లాదేశ్‌లో డెంగ్యూ వేగంగా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా కేసులు నమోదవగా ఈ ఏడాది జనవరి నుండి కనీసం 1,017 మంది మరణించారు.ఈ మహమ్మారి కారణంగా మరణించిన వారిలో 100 మందికి పైగా చిన్నారులు కూడా ఉన్నారు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో రోగులు క్యూ కడుతున్నారు.
: ఫ్రాన్స్ .. పర్యాటకులకు మరియు ప్రేమ పక్షులకు ప్రసిద్ధి చెందిన దేశం... ఇపుడు మనుషుల రక్తాన్ని తాగే బెడ్‌బగ్స్ ను తొలగించడానికి కష్టపడుతోంది. ఇవి గత కొన్ని వారాలుగా వీటిని ప్రజలు వీటిని బట్టలు, బ్యాక్‌ప్యాక్‌లు లేదా డైనింగ్ టేబుల్‌పై - సబ్‌వేలు, సినిమా ధియేటర్స్ వద్ద చూస్తున్నారు.
చైనా సమీపంలోని ఎల్లో సముద్రంలో విదేశీ నౌకల కోసం రూపొందించిన ఉచ్చులో చైనా నూక్లియర్ సబ్ మెరైన్ చిక్కుకోవడంతో 55 మంది చైనా సబ్ మెరైనర్లు చనిపోయారు. యూకే ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం సబ్ మెరైన్ గొలుసు ఉచ్చును ఎదుర్కొంది. సబ్ మెరైన్ యొక్క ఆక్సిజన్ వ్యవస్థలలో విపత్తు లోపం కారణంగా సబ్ మెరైనర్లు మరణించారు.
2023 సంవత్సరానికిగాను భౌతిక శాస్త్రంలో అపార ప్రతిభ కనబరిచిన ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ నోబెల్ బహుమతి వరించింది. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు పెర్రీ అగోస్టిని, ఫెరెంక్ క్రౌజ్, ఎల్'హ్యులియర్‌లకు అణువుల్లో ఎలక్ట్రాన్ డైనమిక్స్'పై చేసిన విస్తృత పరిశోధనలకుగాను వీరిని నోబెల్ బహుమతి వరించింది.
ఇండియాలోని కెనడా రాయబార కార్యాలయంలో ఉన్న 40 మంది రాయబారులను ఈ నెల 10 వ తేదీలోగా దేశం విడిచిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఫైనాన్షియల్ టైమ్స్ మంగళవారం నాడు ఓ వార్తను ప్రచురించింది. అయితే తాజా పరిణామలపై భారత ప్రభుత్వం అధికారికంగా ఓ ప్రకటనల విడుదల చేయాల్సి ఉంది.
యూకేలో జాత్యహంకారానికి అర్దంపట్టే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నర్సులు సిక్కు రోగి యొక్క గడ్డాన్ని ప్లాస్టిక్ గ్లోవ్స్‌తో కట్టి, అతని మూత్రంలో అతడినివదిలి, మతపరమైన కారణాల వల్ల తినలేని ఆహారాన్ని అతనికి అందించినట్లు తెలిసింది. ఆ వ్యక్తి తన మరణశయ్యపై ఉన్న నోట్లో వివక్ష గురించి ఫిర్యాదు చేసినప్పటికీ, ఆ నర్సులను కొనసాగించారు.
గత వారం రోజుల్లో బ్రెజిల్ లోని అమెజాన్ లో 100 కు పైగా డాల్ఫిన్లు మృతిచెందాయి. తీవ్రమైన కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంతంలో నీటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే మరిన్ని త్వరలో చనిపోతాయని నిపుణులు అంటున్నారు.
దక్షిణ మెక్సికన్ రాష్ట్రమైన చియాపాస్‌లో కార్గో ట్రక్కు ప్రమాదంలో 10 మంది క్యూబన్ వలసదారులు మరణించగా 17 మంది తీవ్రంగా గాయపడినట్లు మెక్సికో మైగ్రేషన్ ఇన్స్టిట్యూట్ ఆదివారం తెలిపింది. చియాపాస్‌లోని పిజిజియాపాన్-టోనాలా హైవే యొక్క పసిఫిక్ తీరప్రాంతం వెంబడి ఈ ప్రమాదం జరిగింది.
: నైరుతి జింబాబ్వేలోని వజ్రాల గని సమీపంలో వారి ప్రైవేట్ విమానం కూలిపోవడంతో మరణించిన ఆరుగురు వ్యక్తులలో భారత పారిశ్రామిక వేత్త హర్పాల్ రంధవా మరియు అతని కుమారుడు ఉన్నార జింబాబ్వే మీడియా తెలిపింది
పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఇటి) మోస్ట్ వాంటెడ్ నాయకులలో ఒకరిని కరాచీలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారని పాకిస్తాన్ మీడియా నివేదించింది.26/11 ముంబై దాడి సూత్రధారి హఫీజ్ సయీద్ సన్నిహితుడు ముఫ్తీ ఖైజర్ ఫరూక్ ను కరాచీలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.