Home / latest international news
తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా నియంత్రణలో ఉన్న డొనెట్స్క్ నగరంపై ఉక్రేనియన్ దళాలు కాల్పులకు దిగడంతో 27 మంది మరణించగా 25 మంది గాయపడ్డారు. డొనెట్స్క్ ప్రాంతానికి రష్యా నియమించిన అధిపతి డెనిస్ పుషిలిన్ ఈ విషయాన్ని తెలిపారు.
సోమవారం తెల్లవారుజామున, నైరుతి చైనాలోనియునాన్ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడి 47 మంది సమాధి అయ్యారు. అక్కడనుంచి మరో 200 మందిని తరలించడానికి అధికారులు సిద్దమయ్యారు. ఈ సంఘటన జెన్‌క్సియాంగ్ కౌంటీలోని లియాంగ్‌షుయ్ గ్రామంలో ఉదయం 6 గంటలకు జరిగింది. 18 వేర్వేరు ఇళ్లలో చిక్కుకున్న వ్యక్తులను గుర్తించేందుకు కౌంటీ ప్రచార విభాగం సహాయక చర్యలను ప్రారంభించింది.
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం సూడాన్ లో పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్ ), మిత్రరాజ్యాల అరబ్ మిలీషియా మధ్య జాతి హింసలో గత సంవత్సరం సూడాన్‌లోని వెస్ట్ డార్ఫర్ ప్రాంతంలోని ఒక నగరంలో 10,000 నుండి 15,000 మంది వరకు మరణించారు.
డాగ్ఫ్లేషన్ అనేది పెంపుడు జంతువులకు ఆహారం,సంరక్షణ లకు పెరుగుతున్న ధరల కొలమానంగా ఉద్భవించింది. బ్రిటన్‌లో పెంపుడు జంతువును చూసుకునే ఖర్చు రెండు రెట్లు పెరిగింది. దీనితో దేశంలోని కుక్కల పునరావాస స్వచ్ఛంద సంస్థలు గతంలో ఎన్నడూ లేనంత డిమాండ్ ని ఎదుర్కొంటున్నాయి.
యునైటెడ్ స్టేట్స్ లో శీతల తుఫాన్లకు 10 రాష్ట్రాలలో 55 మంది మృతి చెందారు. అతి శీతలమైన గాలి, వరుస తుఫానుల కారణంగా దేశమంతటా విస్తృతంగామంచు కురుస్తున్న కారణంగా మరణాలు సంభవించాయి. టేనస్సీ రాష్ట్రంలో ఈ వారం 14 మరణాలు ఈ రకంగా సంభవించాయి.
దుబాయ్‌లోని అల్ నహ్యాన్ రాజ కుటుంబం రూ.4వేలకోట్ల భవనం , ఎనిమిది ప్రైవేట్ జెట్లు, ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్‌ను కలిగి ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్నకుటుంబమని తాజాగా ఒక నివేదిక పేర్కొంది.
ఉత్తర ఇటలీ ప్రావిన్స్ అన్ని కుక్కలకు డీఎన్ఏ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించింది, వీధుల్లో పెంపుడు కుక్కల విసర్జితాలను శుభ్రం చేయడంలో విఫలమైతే వాటి యజమానులను కనుగొని జరిమానా విధించే ప్రయత్నంలో ఉంది.కుక్క డీఎన్ఏ సేకరించిన తర్వాత, పరీక్ష ఫలితాలు డేటాబేస్‌లో చేర్చబడతాయి. ఇది కుక్క యజమానులను ట్రేస్ చేయడానికి ఉపయోగిస్తారు.
ఆఫ్రికా దేశం జాంబియాలో కలరాతో వణికిపోతోంది. దేశ వ్యాప్తంగా 10,000 మందికి పైగా కలరా బారిన పడగా 400 మందికి పైగా మరణించానే. దీనితో ప్రభుత్వం దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేసింది. రాజధాని లుసాకాలోని ఫుట్‌బాల్ స్టేడియంను చికిత్సా కేంద్రంగా మార్చింది.
ఇరాన్‌లోని సిస్తాన్ అండ్ బలూచిస్థాన్ ప్రావిన్స్‌పై పాకిస్తాన్ ప్రతీకార దాడుల్లో ముగ్గురు మహిళలు మరియు నలుగురు పిల్లలతో సహా కనీసం ఏడుగురు మరణించారని ఆ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ అలీరెజా మర్హమతి స్టేట్ టీవీలో తెలిపారు. పాకిస్తాన్ దాడిలో మరణించిన వ్యక్తులు ఇరాన్ పౌరులు కాదని మర్హమతి చెప్పారు.
ఇరాన్ దేశ రాయబారిని తమ దేశం నుంచి పాకిస్థాన్ బహిష్కరించింది. తమ దేశానికి చెందిన రాయబారిని కూడా ఇరాన్ వదిలి వచ్చేయాలని కోరింది. తమ భూభాగంలోని బలూచిస్థాన్ ప్రావిన్సులో ఇరాన్ దాడులు జరపడం చట్ట విరుద్ధమని పాకిస్థాన్ ప్రకటించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.