Home / landslides
శ్రీలంకను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. చెట్లు కూలిపడ్డంతో సుమారు 15 మందిమృతి చెందారని శ్రీలంక డిజాస్టర్ సెంటర్ ఆదివారం వెల్లడించింది. భారీ వరదలకు దేశ రాజధాని కొలంబోలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు నీట మునిగిపోయారు.
సోమవారం తెల్లవారుజామున, నైరుతి చైనాలోనియునాన్ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడి 47 మంది సమాధి అయ్యారు. అక్కడనుంచి మరో 200 మందిని తరలించడానికి అధికారులు సిద్దమయ్యారు. ఈ సంఘటన జెన్‌క్సియాంగ్ కౌంటీలోని లియాంగ్‌షుయ్ గ్రామంలో ఉదయం 6 గంటలకు జరిగింది. 18 వేర్వేరు ఇళ్లలో చిక్కుకున్న వ్యక్తులను గుర్తించేందుకు కౌంటీ ప్రచార విభాగం సహాయక చర్యలను ప్రారంభించింది.
తూర్పు డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో బుకావు నగరంలో కుండపోత వర్షాలతో కొండచరియలు విరిగిపడి ఇళ్లు కూలిపోవడంతో 14 మంది మరణించారు.బాధితులందరూ ఇబాండాలోని బుకావు కమ్యూన్లో మరణించారు. అక్కడ వర్షం కింద కూలిపోయిన తాత్కాలిక ఇళ్లలో చాలా మంది నివసిస్తున్నారని కమ్యూన్ మేయర్ జీన్ బాలెక్ ముగాబో చెప్పారు.
ఉత్తర టాంజానియాలో వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 47 మంది మరణించగా 85 మంది గాయపడ్డారు.రాజధాని డోడోమాకు ఉత్తరాన 300 కిలోమీటర్ల (186 మైళ్లు) దూరంలో ఉన్న కటేష్ పట్టణంలో శనివారం భారీ వర్షం కురిసిందని జిల్లా కమీషనర్ జానెత్ మయంజా తెలిపారు.మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆమె తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో గురువారం కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో పలు బహుళ-అంతస్తుల భవనాలు కూలిపోతున్న వీడియోలు వైరల్ అయ్యాయి.
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి మరణించిన వారి సంఖ్య 25 కు చేరింది. ఈ ఘటనలో 86 మంది గ్రామస్తుల జాడ ఇంకా తెలియలేదని అధికారులు తెలిపారు. వీరికోసం గాలింపు జరుగుతోందని అన్నారు.
హైతీలో వారాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగావిస్తృతంగా వరదలు పోటెత్తడం, కొండచరియలు విరిగిపడటంతో 15 మంది మరణించారు. ఎనిమిది మంది తప్పిపోయారు. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో పలువురు నిరాశ్రయులయ్యారు.
బ్రెజిల్లో కుండపోత వర్షం కారణంగా వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో కనీసం 36 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి కొన్ని దేశాలు అల్లాడుతున్నాయి. దక్షిణ అమెరికా దేశమైన వెనెజులాను భారీవర్షాలు అతలాకుతలం చేశాయి. భారీ వర్షాల కారణంగా దేశ రాజధాని కారకాస్‌కు సమీపంలోని లాస్ టెజెరస్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీనితో 22 మంది మృతి చెందగా మరో 52 మంది గల్లంతయ్యారు.
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు మరణించగా 13 మంది గల్లంతయ్యారు. రాష్ట్రంలోని హమీర్పూర్ జిల్లాలో వరదల కారణంగా చిక్కుకుపోయిన 22 మందిని సురక్షితంగా తరలించినట్లు