Home / Israel-Hamas war
విదేశీ పాస్‌పోర్ట్ హోల్డర్ల మొదటి బృందం బుధవారం యుద్ధంలో దెబ్బతిన్న గాజా స్ట్రిప్ నుండి ఈజిప్ట్‌కు బయలుదేరింది. ఈ తరలింపు ఈజిప్ట్, ఇజ్రాయెల్ మరియు హమాస్‌లతో కూడిన కతార్ మధ్యవర్తిత్వ ఒప్పందం ఫలితంగా వచ్చింది.
గాజా స్ట్రిప్‌లో ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 50 మంది బందీలు మరణించారని హమాస్ ఉగ్రవాద సంస్థ పేర్కొంది, హమాస్ యొక్క సాయుధ విభాగం, అల్-కస్సామ్ బ్రిగేడ్స్ తన టెలిగ్రామ్ ఛానెల్లో ఒక ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయెల్ సైన్యం రాత్రిపూట దాడి తరువాత ఈ ప్రకటన వచ్చింది.
గాజా సరిహద్దు సమీపంలో శనివారం రాత్రి జరిగిన వైమానిక దాడిలో హమాస్‌కు చెందిన నుఖ్బా కమాండో దళాలకు చెందిన ఇద్దరు సభ్యులను హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ( ఐడిఎఫ్)తెలిపింది. అదే ఘటనలో ఇతర హమాస్ ఉగ్రవాదులు కూడా మరణించారని పేర్కొంది.
హమాస్ - ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా దెబ్బతిన్న పాలస్తీనాకు భారతదేశం ఆదివారం మానవతా సాయం పంపింది. దాదాపు 6.5 టన్నుల వైద్య సహాయం మరియు 32 టన్నుల విపత్తు సహాయ సామగ్రిని పాలస్తీనాకు పంపారు. ఇవి ఈజిప్టు మీదుగా పాలస్లీనాకు చేరుకుంటాయి.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) హమాస్ మిలిటెంట్లను అంతమొందించడానికి 4,000 టన్నుల బరువున్న 6,000 బాంబులను ప్రయోగించడం ద్వారా గాజా స్ట్రిప్‌పై దాడిని కొనసాగించింది. యుద్ధం యొక్క ఆరవ రోజు తెల్లవారుజామున ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో డజన్ల కొద్దీ ఫైటర్ జెట్లు, హెలికాప్టర్ గన్‌షిప్‌లు మరియు విమానాలు కూడా ఉన్నాయి.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజా స్ట్రిప్ నుండి హమాస్‌ను తుడిచిపెట్టేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్ మిలటరీ గురువారం నాడు, గాజాలో 3,60,000 మంది బలగాలతో గ్రౌండ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. అయితే, రాజకీయ నాయకత్వం ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదని ఉన్నత సైనిక అధికారి చెప్పారు.
ఇజ్రాయెల్ మరియు హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం ఐదవ రోజుకు చేరుకోగా ఇరు వైపులా మరణించిన వారి సంఖ్య 3,000 దాటింది. ఇజ్రాయెల్వైమానిక దాడులతో పాటు గాజాలో భూదాడిని ప్రారంభించడం ద్వారా దాడిని ఉధృతం చేయడానికి సిద్ధమవుతోంది. భారీ సైనిక సామగ్రితో పాటు రిజర్వ్ దళాలకు చెందిన మరింత మంది సభ్యులను కూడా పిలిపించారు.