Home / International News
చైనాలోని ఓ గొర్రెలు మంద గుండ్రంగా తిరుగుతూ వింతగా ప్రవర్తిస్తున్నాయి. గత 12 రోజులుగా అలుపు సొలుపు లేకుండా నిరంతరాయంగా తిరుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ బాజ్వా త్వరలోనే రిటైర్ కాబోతున్నారు. ఈ నేపధ్యంలో ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బాజ్వా ఆయన కుటుంబసభ్యులు, ఆయన బంధువులు కేవలం ఆరు సంవత్సరాల కాలంలో బిలియనీర్లు అయ్యారని వెల్లడించింది పాక్ డిజిటల్ మీడియా.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఓ మహిళ ఆయన చెంపను ఛెళ్లుమనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడంతో, డిజిటల్ అడ్వర్టైజింగ్ వ్యాపారం దెబ్బతిని టెక్ స్టాక్‌ల విలువలో పతనానికి దారి తీస్తుంది.
కొలంబియా దేశంలోని మెడెలిన్ నగరంలోని ఓ ఇంటిపై విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది మరణించారని మెడెలిన్ మేయర్ డేనియల్ క్వింటెరో చెప్పారు.
మనం సర్వసాధారణంగా ఆక్వేరియంలలో గోల్డ్ ఫిష్ పెంచుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతాం. ఎందుకంటే అవి ఆరెంజ్ మరియు బంగారం వర్ణం కలగలిపి చాలా అందంగా చిన్నగా ఉంటాయి. కానీ, ఇదే గోల్డ్ ఫిష్ 30 కిలోల బరువుతో, పెద్ద పరిమాణంలో ఉందని చెబితే మీరు నమ్మగలరా..?
సెంట్రల్ చైనాలోని ఒక ప్లాంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 36 మంది మరణించగా ఇద్దరు తప్పిపోయారు. సోమవారం మధ్యాహ్నం సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని అన్యాంగ్ సిటీలోని ఒక ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది" అని వార్తా సంస్థ జిన్హువా తెలిపింది.
ఇండోనేషియాను వరుస భూకంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. నిన్న సంభవించిన భూ ప్రకంపనల ధాటికి 162 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం జావాలో సోమవారం సంభవించిన భూకంపంలో కనీసం 44 మంది మరణించారు . 300 మందికి పైగా గాయపడ్డారు.
మన వాట్సాప్ ను మరొకరు చూస్తే మన గోప్యతకు భంగం కలుగుతుంది కదా డెస్క్ టాప్ లలో వాట్సాప్ లాగిన్ చేసి లాగ్ అవుట్ చెయ్యడం మర్చిపోతే దానిని ఎవరు ఓపెన్ చేసినా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. కాగా ఈ సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుంది. డెస్క్ టాప్ (కంప్యూటర్లు)పై వాట్సాప్ యాప్ ఓపెన్ అవ్వాలంటే పాస్ వర్డ్ ఇవ్వడం తప్పనిసరి.