Home / Imran khan
పాకిస్థాన్ మాజీ ముఖ్యమంత్రి ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ, ఆయన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన మరో 80 మంది సభ్యులను నో ఫ్లై లిస్ట్‌లో చేర్చినట్లు సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి. వీరు వాణిజ్య విమానంలో ప్రయాణించకుండా నిషేధించబడతారు. భద్రతాపరమైన ప్రమాదంగా పరిగణించబడతారు.
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. అల్ ఖదీర్ ట్రస్టు కేసులో ఖాన్‌కు రెండు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. మంగళవారం నాడు ఇదే ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణం నుంచే ఖాన్ ను నేషనల్ అకౌంటబిలిటి బ్యూరో బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లింది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వివాదాస్పద తోషాఖానా కేసులో ఊరట లభించింది. ఈ అంశాన్ని విచారించిన ఇస్లామాబాద్ హైకోర్టు దీనిపై స్టే విధించింది.. కోర్టు తన తీర్పును వెలువరిస్తూ, తోషఖానా కేసుకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్ పై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై నిలుపుదల ఉత్తర్వు జారీ చేసింది
మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌కు ఆ దేశ సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఇమ్రాన్‌ను అవినీతి నిరోధక విభాగం ఇమ్రాన్ ను చట్టవిరుద్ధంగా అరెస్టు చేసిందన్న
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అవినీతి నిరోధక శాఖ ఎనిమిది రోజుల పాటు కస్టడీకి పంపింది. నేషనల్ అకౌంటబిలిటీ (NAB) అవినీతి కేసుల్లో ప్రశ్నించేందుకు ఇమ్రాన్ ఖాన్ ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఇస్లామాబాద్‌లోని కోర్టును కోరింది.దీనితో కోర్టు ఎనిమిదిరోజుల పాటు కస్టడీకి అనుమతించింది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని మరియు పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో ( ఎన్ఏబి) ఆదేశాల మేరకు మంగళవారం పారామిలటరీ రేంజర్లు ఇస్లామాబాద్ హైకోర్టులోని ఒక గదిలోకి ప్రవేశించి అదుపులోకి తీసుకున్నారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల అరెస్టు చేసారు. అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్‌ను అరెస్టు చేసినట్లు ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) అక్బర్ నాసిర్ ఖాన్ పేర్కొన్నట్లు ఇస్లామాబాద్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ)ని "నిషిద్ధ" సంస్థగా ప్రకటించాలని భావిస్తున్నట్లు పాకిస్తాన్ అంతర్గత మంత్రి రానా సనువల్లా చెప్పారు. దీనికోసం ప్రభుత్వం నిపుణులను సంప్రదిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇస్లామాబాద్‌లోని జిల్లా మరియు సెషన్స్ కోర్టు సోమవారం పిటిఐ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌కు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. మహిళా అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి మరియు సీనియర్ పోలీసు అధికారులపై బెదిరింపు పదజాలం ఉపయోగించిన కేసులో ఈ వారెంట్ జారీ అయింది.
:పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం ప్రభుత్వ సంస్థలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలు' చేసిన కొన్ని గంటల తర్వాత తక్షణమే అతని ప్రసంగాలను పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా వాచ్డాగ్ ఆదివారం నిషేధించింది.