Home / Hyderabad News
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు మరో కీలక మలుపు తిరిగింది. అరబిందో ఫార్మా డైరక్టర్ శరత్ చంద్రారెడ్డి సతీమణి.. కనికారెడ్డికి చెందిన జెట్ సెట్ గో విమానాల రాకపోకలపై వివరాలను కోరుతూ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఈడీ లేఖ రాసింది.
భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు తెలంగాణలో పర్యటించనున్న నేపధ్యంలో రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపుమధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆంక్షలు ఉండనున్నాయి. పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాష్ నగర్, రసూల్‌పుర, ప్యాట్నీ సిగ్నల్ వరకు ట్రాఫిక్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది.
భాగ్యనగరంలో తెల్లారితే చాలు, ఉరుకులు పరుగులు మీద తమ తమ గమ్యస్ధానాలకు చేరుకొనే సామాన్యులు, ఉద్యోగుల రద్దీతో ప్రధాన మార్గాలు కిటకిటలాడుతుంటాయి. ఈ క్రమంలో ప్రజలు రోడ్డు, మెట్రో రైలు సేవలను అధికంగా వినియోగిస్తుంటారు. అయితే నేడు ఉదయం చోటుచేసుకొన్న సాంకేతిక లోపం కారణంగా మెట్రో రైలు సేవలు ఆగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైనారు.
హైదరాబాద్ లో ఈనెల 19, 20వ తేదీల్లో మరియు వచ్చేనెల 10,11వ తేదీల్లో ఫార్ములా ఈ రేస్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా-ఈ రేస్ పోటీలకు హుస్సేన్‌సాగర్ వేదిక కానుంది.
భారత్ జోడో యాత్ర హైదరాబాదు నగరంలో ఉత్సాహంగా సాగుతోంది. పాదయాత్ర సాగే క్రమంలో లింగంపల్లి చౌరస్తా నుండి ముత్తంగి వరకు భారీ కాన్వాయ్ ఓవైపుగా, మరో వైపు సాధారణ వాహనాలను దారి మళ్లించారు. వన్ వేలోనే రెండు వైపులా వాహనాలు వెళ్లే విధంగా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు.
త్యం ఉరుకుల పరుగుల జీవితం సాగించే హైదరాబాద్ ప్రజలు చాలా మంది మెట్రోపై ఆధారిపై ఉంటారు. తక్కువ ధరకు అతితక్కువ సమయంలో ట్రాఫిక్ ఆటంకం లేకుండా చాలా మంది ఈ మెట్రో ద్వారా ప్రయాణాలు సాగిస్తుంటారు. అయితే తాజాగా ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది మెట్రో యాజమాన్యం. త్వరలోనే మెట్రోరైలు చార్జీలను పెంచనుంది.
దక్షిణ రాష్ట్రాల్లోని ప్రసిద్ధి నగరాల్లో ఒకటైన హైదరాబాదు నగరంలో నిషేధిత ప్లాస్టిక్ ను కట్టడి చేసేందులో ప్రభుత్వం విఫలం చెందింది. దీంతో భాగ్యనగరంలో ప్లాస్టిక్ భూతం, పర్యావరణాన్ని శరవేగంగా కబలిస్తుంది.
ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పచ్చదనాన్ని అభివృద్ధి చేసినందుకు హైదరాబాద్ నగరం ప్రతిష్టాత్మక AIPH గ్లోబల్ ‘వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ 2022’ అందుకుంది.
మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావును సర్వీసు నుంచి తొలగిస్తూ తెలంగాణ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది
Hyderabad: హైద్రాబాద్ ను వీడని వానలు