Home / Hari hara veeramallu
పవన్ కల్యాణ్ అభిమానులతోపాటు సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా ఓ సందేశాన్ని మరియు కొన్ని ఫొటోలను హరిహర వీరమల్లు టీం నెట్టింట ప్రేక్షకులతో పంచుకుంది.
క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరపైకి ఎక్కిస్తున్న హరిహరవీరమల్లు చిత్ర షూటింగ్ హైదరాబాదు రామోజీ ఫిలింసిటీలో ఫైట్ సీక్వెన్స్ ను ఎక్కిస్తున్నారు. క్రిష్, పవన్ టీం ఇటీవలే వర్క్ షాపులో కూడా పాల్గొన్నారు. సెట్స్ పైకి ఎక్కిన ఈ సినిమా షూటింగ్ తొలినుండి అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం హరి హర వీర మల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పీరియాడికల్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం. చాలా కాలం క్రితం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు, సెప్టెంబర్ 2న అభిమానుల కోసం కొత్త ప్రమోషనల్ మెటీరియల్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.