Home / Gautam Adani
దేశంలో 12 మంది భారతీయుల నికర విలువ రూ. 1 ట్రిలియన్ కంటే ఎక్కువగా ఉందని బుధవారం వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ నివేదికలో తేలింది. గౌతమ్ అదానీ అగ్రస్థానంలో ఉన్నఈ జాబితాలో ముఖేష్ అంబానీ, సైరస్ పూనావల్లా, శివ్ నాడార్ మరియు రాధాకిషన్ దమానీ వంటి పేర్లు ఉన్నాయి.
అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం, సెప్టెంబర్ 16, 2022 నాటికి అదానీ నికర విలువ $155.7 బిలియన్గా ఉండటంతో ఇప్పటివరకు రెండవస్దానంలో ఉన్న అమెజాన్‌కు చెందిన జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టారు.
భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలో మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లోని తాజా జాబితా అమెజాన్‌కు చెందిన జెఫ్ బెజోస్ మరియు టెస్లా యొక్క ఎలోన్ మస్క్‌ల తర్వాత గౌతమ్ అదానీ మూడవ స్థానంలో ఉన్నారు.
ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితా ప్రకారం, భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తి గౌతమ్ అదానీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను అధిగమించి ప్రపంచంలోని నాల్గవ సంపన్న వ్యక్తి అయ్యాడు. ఫోర్బ్స్ జాబితాలో, గత వారం బిల్ గేట్స్ తన సంపదలో $20 బిలియన్లను