Home / Election Commission
ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే దొంగ ఓట్లు ఎక్కువగా నమోదవుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు తాజాగా ఆయన ఫిర్యాదుకు ఎలక్షన్ కమిషన్ సమాధానం ఇచ్చింది. ఎంపీ రఘురామకు
ఆంధ్రప్రదేశ్ లో దొంగ ఓట్ల పంచాయితీ ఢిల్లీకి చేరింది. సీఈసీతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఏపీ ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఓట్లు తొలగించారని ఆరోపించారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని కంప్లైంట్ చేశారు.
తెలంగాణలో సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. ఇందుకోసం అధికారులకు వరుసగా ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వనుంది.
కర్ణాటక ప్రతిష్ట, సార్వభౌమాధికారం లేదా సమగ్రతకు ముప్పు కలిగించేలా కాంగ్రెస్ ఎవరినీ అనుమతించదు అని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం సందర్బంగా శనివారం జరిగిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు.
ECI: పంజాబ్ లో ఘన విజయం తర్వాత.. ఆ పార్టీ జాతీయ హోదాను దక్కించుకుంది. పార్టీల హోదాలను మారుస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు వెలువరించింది.
ఈ నోటిషికేషన్ ప్రకారం ఓటర్లు ఫామ్ -6బీ ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నుంచి ఎన్నికల కమిషన్ రిజిస్టర్ అయిన ఓటర్ల నుంచి ఆధార్ నెంబర్లు సేకరించడం ప్రారంభించింది.
ప్రధాన ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషనర్ల నియామకాల కోసం కొలీజియం లాంటి వ్యవస్థను తీసుకురావాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసారు.. తన తండ్రి బాల్ థాక్రే స్థాపించిన శివసేన పార్టీ పేరును, గుర్తును ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి కోల్పోయిన రెండు రోజుల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రిమోట్ ఈవీఎం పనితీరును ప్రదర్శించేందుకు అన్ని గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం సోమవారం ఆహ్వానించింది.
దేశంలో చేపట్టే ఎన్నికల్లో బ్యాలట్ పత్రాలు, ఈవీఎంలలో మార్పులు చేసేలా ఎన్నికల సంఘానికి సూచనలు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.