Home / Delhi Police
న్యూఢిల్లీలో నిరసన తెలిపిన రెజ్లర్లపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) దాఖలు చేయాలని అభ్యర్థనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు యాక్షన్ టేక్ రిపోర్ట్ (ఎటిఆర్)ని కోర్టుకు సమర్పించారు.రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై తప్పుడు ఆరోపణలు చేశారని, విద్వేషపూరిత ప్రసంగానికి పాల్పడ్డారని పిటిషన్లో ఆరోపించారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు మరియు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ భారత అగ్రశ్రేణి రెజ్లర్ల నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఢిల్లీ పోలీసు అధికారుల బృందం సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని గోండాలోని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసాన్ని సందర్శించింది.
క్యాష్ అడ్వాన్స్’ అనే మోసపూరిత లోన్ యాప్‌ను ఉపయోగించి దేశవ్యాప్తంగా 1,977 మందికి పైగా 350 కోట్ల రూపాయల మేర మోసగించిన ముఠాను ఛేదించడంలో ఢిల్లీ పోలీసులు విజయం సాధించారు. IFSO (ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ & స్ట్రాటజిక్ ఆపరేషన్స్), ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందం ఈ ముఠాను ఛేదించింది
ఆదివారం జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నిరసన నిర్వాహకులు మరియు ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ మరియు నిరసన నిర్వాహకులపై కేసు నమోదు చేయబడింది.
Manish Sisodia: దిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన తీరు ఇపుడు చర్చనీయంశంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ నివాసాన్ని సందర్శించిన కొన్ని గంటల తర్వాత ఆయన నాలుగు పేజీల ప్రాథమిక సమాధానాన్ని సమర్పించారు. మరో 8-10 రోజులలో వివరంగా ప్రతిస్పందిస్తానని తెలిపారు.
ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో దీక్ష ఏర్పాట్లలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ల కోసం జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారుల బృందం ముంబైలోని నవ సేవా పోర్ట్ నుండి హెరాయిన్ పూసిన 20 టన్నుల కంటే ఎక్కువ లైకోరైస్‌ను కలిగి ఉన్న కంటైనర్‌ను స్వాధీనం చేసుకుంది.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ దాడులు, అల్లర్లకు జరిగే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్ నుంచి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పదివేల మంది పోలీసులను ఢిల్లీలో మోహరించారు. గాలిపటాలు, బెలూన్లు, డ్రోన్లు ఎగురవేయకుండా ఆంక్షలు విధించారు.