MLC Kavitha: కవిత గైర్హాజరుపై సర్వత్రా చర్చ
యావత్తు దేశంలో పెద్ద చర్చకు దారితీసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని జాతీయ పార్టీ గా మారుస్తూ భారత రాష్ట్ర సమితి పార్టీగా జీవం పోసుకొన్న కీలక తరుణంలో మరో వాదం తెరపైకి వచ్చింది. సీఎం కేసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ అవిష్కరణ సమయంలో ఆమె గైర్హాజరుపై సర్వత్రా చర్చకు దారితీసింది. నెట్టింట ఎందుకు పాల్గొనలేదనంటూ విభన కధనాలను వ్యాపిస్తున్నారు.
TRS to BRS: యావత్తు దేశంలో పెద్ద చర్చకు దారితీసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని జాతీయ పార్టీ గా మారుస్తూ భారత రాష్ట్ర సమితి పార్టీగా జీవం పోసుకొన్న కీలక తరుణంలో మరో వాదం తెరపైకి వచ్చింది. సీఎం కేసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ అవిష్కరణ సమయంలో ఆమె గైర్హాజరుపై సర్వత్రా చర్చకు దారితీసింది. నెట్టింట ఎందుకు పాల్గొనలేదనంటూ విభన కధనాలను వ్యాపిస్తున్నారు.
21 సంవత్సరాల ఉద్యమ చరిత్ర కల్గిన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆ పార్టీ మారుస్తూ అధినేత సీఎం కేసిఆర్ తీసుకొన్న నిర్ణయం అందరికి తెలిసిందే. ఇందుకు ప్రగతి భవన్ లో అట్టహాసంగా తలపెట్టిన టీఆర్ఎస్ పార్టీ సర్వ సభ్య సమావేశంలో ఆ పార్టీకి చెందిన క్యాడర్ మొత్తం ఏక గ్రీవంగా తీర్మానం చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు. ఆ క్రమంలో ప్రతివక్కరూ తీర్మాన పత్రాలపై సంతకాలు కూడా చేశారు. కేసిఆర్ కుటుంబ సభ్యులైన కేటిఆర్, హరీష్ రావు తో సహా పలువురు తీర్మానం సమయంలో అక్కడే ఉన్నారు.
అయితే అందరిని ఆశ్చర్య పరుస్తూ, ప్రతిపక్షాలకు అవకాశం కల్పించేలా ఎమ్మెల్సీ కవిత ఆ కార్యక్రమానికి గైర్హాజరైనారు. తీర్మానం జరిగే సమయంలో ఆమె ప్రగతి భవన్ లోనే ఉన్నప్పటికీ, కరళాధ్వనుల మద్య చోటు చేసుకొన్న జాతీయ పార్టీ అవిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొనలేదు. దీంతో ఒక్కసారిగా పార్టీ శ్రేణుల్లోనే కొద్దిగా అలజడి ప్రారంభమైంది.
ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీని బలపరిచే క్రమంలో ఆయా రాష్ట్రాల నుండి కీలక నేతలు సైతం బీఆర్ఎస్ పార్టీపై తీసుకొన్న తీర్మాన కార్యక్రమానికి హాజరైనారు. మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామితోపాటు పలువరు కీలక నేతలు వచ్చిన వారిలో ఉన్నారు.
వీరందరికి ప్రగతి భవన్ ఎదురుగా ఉన్న స్టార్ హోటల్ నందు అన్ని ఏర్పాట్లు చేశారు. వీటన్నింటి ఏర్పాట్లను కేసిఆర్ కుటుంబ సభ్యులే ప్రత్యేకంగా దగ్గరుండీ పర్యవేక్షించారు. కానీ కేసిఆర్ కుమార్తె కవిత మాత్రం పార్టీ సర్వసభ్య కార్యక్రమానికి గైర్హాజరవడం పట్ల సర్వత్రా చర్చకు దారితీసింది.
గత కొద్ది రోజుల క్రితం ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత హస్తం ఉందని భాజపా నేతలు నేరుగా ప్రకటించివున్నారు. త్వరలో ఆ విషయాలన్నీ ఈడీ బయటకు తీసుకొస్తుంది అని చెప్పారు. ఆ వ్యవహారంలో టీఆర్ఎస్ శ్రేణులు కాని, కేసిఆర్ అండ్ టీం కాని ఎక్కడా లిక్కర్ స్కాం గురించి మాట్లాడలేదు. వాస్తవం కాదని కూడా ఎవ్వరూ ఖండించలేదు. కవిత మాత్రం నోటీసు ఇచ్చిన్నప్పుడు నేను స్పందిస్తానంటూ మీడియాతో పేర్నొనివున్నారు. అనంతరం లిక్కర్ స్కాం పై హైదరాబాదులో ఈడీ కవిత ఆడిటర్ ఇంటితో సహా మరికొందరి కార్యాలయాలు, ఇండ్లపై శోదాలు చేసి కీలక సమాచారాన్ని సేకరించివున్నారు.
కేసిఆర్ చేపట్టిన ఉద్యమం నాటి నుండి నిన్నటివరకు కవిత ప్రభావం టీఆర్ఎస్ పార్టీలో అధికంగా ఉంది. జాతీయ పార్టీగా మారుస్తూ తీసుకొన్న సంచలన నిర్ణయం సమయంలో కవిత తన తండ్రి కేసిఆర్ పక్కన లేకపోవడంపై ఆమే వివరణ ఇచ్చేంతరకు నెట్టింట అవుతున్న ట్రోల్స్ ఆగవని గుర్తించాలి.
ఇది కూడా చదవండి:TRS now BRS: తెరాస..అయిందిక… భారత రాష్ట్ర సమితి