Home / CBI
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దూకుడు పెంచింది. దీనిలో భాగంగా హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే అభిషేక్ రావు నివాసంలో ఈడీ, సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
తెలంగాణా సీఎం కేసీఆర్ అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు తరచూ ఆరోపిస్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరిపించాలంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీబీఐకు ఫిర్యాదు చేసారు. దీనిపై త్వరగా విచారణ జరపాలంటూ నేడు ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
డ్రగ్స్ మరియు స్మగ్లింగ్ మరియు సరఫరాతో సంబంధం ఉన్న వ్యక్తుల పై భారీ దాడిలో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) భారతదేశంలోని అనేక ప్రదేశాలలో దాడులు నిర్వహించింది. యాంటీ డ్రగ్స్ ఆపరేషన్‌కు సంబంధించి సుమారు 175 మందిని అరెస్టు చేసింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఘటనలో సీబిఐ తన దర్యాప్తును వేగవంతం చేసింది. కొంతకాలంగా స్ధబ్దుగా ఉన్న సీబిఐ విచారణ తిరిగి ఊపందుకొనింది.
తీసుకున్న రుణాలను చెల్లించకుండా పలు బ్యాంకులను మోసం చేసిన ఏబీజీ షిప్ యార్డ్ మాజీ చైర్మన్ రిషి కమలేష్ అగర్వాల్ ను సీబీఐ అరెస్ట్ చేసింది
రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వివేకానంద రెడ్డి హత్యపై సీబిఐకి సహకరించడం లేదు, కేసును మరో రాష్ట్రానికి తరలించాలంటూ వివేక కూతురు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన వెంటనే సీబిఐ బృందం కడపలో విచారణ చేపట్టడం సర్వత్రా చర్చకు దారితీసింది
ఏపీలో పెద్ద దుమారం లేపిన వైఎస్ వివేకా హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఆయన కుమార్తె సునీత రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సర్వోత్తమ న్యాయస్ధానం విచారణ చేపట్టింది.
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సాక్షులను ఆయన బెదిరిస్తున్నారని సీబీఐ తన పిటిషన్ లో పేర్కొంది. పదే పదే డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ ఆరోపించింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రుణం ఎగవేత కేసులో సీబీఐ కోర్టు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతతో పాటు ఆమె భర్త పి. రామకోటేశ్వరరావు, , బ్యాంకు అధికారులకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ. లక్ష చొప్పున జరిమానాలను కూడా కోర్టు విధించింది.