Home / BJP
కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీపై భారతీయన జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రముఖ నటి, ఎంపీ సుమలత బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి తాను మద్దతిస్తున్నానని ఆమె విలేకరులతో అన్నారు. బీజేపీలో చేరే విషయమై తాను ఏడాదిపాటు ఆలోచించానని ఆమె తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ఇప్పుడు తాజాగా వార్తల్లో నిలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే బీజేపీ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు కోడైకూస్తున్నాయి. ఈ మేరకు కిరణ్ కుమార్ ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు చర్చలు జరిపినట్టుగా సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లోనే కాంగ్రెస్కు రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ ఆమె దీక్ష చేయనున్నారు. ఈ మేరకు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కవిత దీక్ష కొనసాగనుంది.
Karnataka MLA: కర్ణాటక లంచం కేసు.. ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే భాజపా ఎమ్మెల్యే కుమారుడితో సహా ఐదుగురిని అరెస్టు చేశారు. దీంతో ఎమ్మెల్యే పాత్రపైనా పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు తెలిపారు. భాజపా తనయుడి ఇంట్లో సుమారు రూ.8కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
Karnataka Bribe: కర్ణాటకలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా భాజపా ఎమ్మెల్యే తనయుడు రూ. 40 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.
Bandi Sanjay: తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో భాజపా ఒంటరిగానే పోటీ చేస్తుందని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. భాజపా మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని విమర్శించారు. భాజపా దయ వల్లే కేసీఆర్ సీఎం అయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Bandi Sanjay: దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లో బండి సంజయ్, తెలంగాణ భాజపా నేతలు సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఇందులో భాజపా భవిష్యత్ కార్యాచరణ.. రాబోయే ఎన్నికల్లో పార్టీ వ్యూహాలపై చర్చించారు.
ప్రముఖ సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ గురించి అందరికీ తెలిసిందే. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రిలో కుష్బూకి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాట ఆమెకు ఏకంగా గుడి కూడా కట్టారంటేనే అర్దం చేసుకోవచ్చు.. కుష్బూ ఫాలోయింగ్ ఏంటో.
మాజీ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ లో చేరారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు కన్నాకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.