Home / Arvind Kejriwal
లోకసభ ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌ను ప్రశ్నించింది. కాగా అరవింద్ కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మనుసింఘ్వీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగించారు.మే 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వీరిద్దిరిని వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా తన ముందు హాజరుపరచాలని రౌస్ అవెన్యూ కోర్టులోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా తీహార్ జైలు అధికారులను ఆదేశించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, తమ పార్టీ I.N.D.I.A కూటమికి పూర్తిగా కట్టుబడి ఉందని, అయితే డ్రగ్స్‌తో వ్యవహరించే వారిని విడిచిపెట్టబోమని అన్నారు.డ్రగ్స్ కేసులో పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా అరెస్టయిన తర్వాత కేజ్రీవాల్ ఈ విషయాన్ని స్పష్టం చేసారు.
ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన మరియు అమలులో అవకతవకలు జరిగాయని ఆరోపించిన కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ముందు హాజరయ్యారు
Kejriwal: దేశ రాజకీయాల్లో కీలక పరిమాణం చోటు చేసుకుంది. దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కేసులో భాగంగా.. దిల్లీ మద్యం విధానంపై ఆయన్ను సీబీఐ ప్రశ్నించనుంది.
అవసరమైతే పార్టీ నేతలు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తించిన తర్వాత పార్టీ వాలంటీర్లను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు.
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ ఫోర్సమెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సెక్రటరీ కి ఈడీ సమన్లు జారీ చేసింది.
Khammam: బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభకు.. ఖమ్మం వేదికైంది. ఈ సభ కోసం బీఆర్ఎస్ భారీగా ఖర్చు చేస్తోంది. బీఆర్ఎస్ ఆవిర్భావ పేరుతో నిర్వహిస్తున్న ఈ సభకు కార్యకర్తలు భారీగా వచ్చే అవకాశం ఉంది. ఇక సభాస్థలి వేదికను సర్వాంగ సుందరంగా తయారు చేస్తున్నారు. దీంతో ఖమ్మం (Khammam) మెుత్తం గులాబీమయంగా మారిపోయింది. దారులన్నీ ఖమ్మం వైపే భారాస ఆవిర్భావ సభకు ఖమ్మం ముస్తాబైంది. ఈ వేదికను బీఆర్ఎస్ శ్రేణులు సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. […]
ప్రభుత్వ ప్రకటనల రూపంలో రాజకీయ ప్రకటనల కోసం రూ.163.62 కోట్లు ఖర్చుపెట్టినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి గురువారం నోటీసులు అందాయి. ఈమొత్తాన్ని 10 రోజుల్లోగా చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.
మార్చి 1 తర్వాత మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, మీ అన్నగా మీ తరపున నేను చేస్తాను. మార్చి 1 తర్వాత గుజరాత్‌కు కూడా 24 గంటల కరెంటు సరఫరా, జీరో బిల్లు వస్తుంది’ అని ఆప్ అధినేత అరవింద్ చెప్పారు.