Last Updated:

Swati Maliwal Assault Case: ఆప్ ఎంపీ స్వాతి మలీవాల్‌ పై దాడి చేసిన భైభవ్‌కుమార్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

అరవింద్‌ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్‌ ఆద్మీపార్టీలో ఆల్‌ ఈజ్‌ నాట్‌ వెల్‌గా ఉంది. ఆమ్‌ ఆద్మీపార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలీవాల్‌ ఇటీవల అరవింద్‌ కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లినప్పుడు ఆయన పర్సెనల్‌ సెక్రటరీ బైభవ కుమార్‌ ఆమెపై దాడి చేశాడు. దీంతో మలీవాల్‌ కుమార్‌ పై ఫిర్యాదు చేశారు. పో

Swati Maliwal Assault Case: ఆప్ ఎంపీ స్వాతి మలీవాల్‌ పై దాడి చేసిన భైభవ్‌కుమార్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

Swati Maliwal Assault Case:అరవింద్‌ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్‌ ఆద్మీపార్టీలో ఆల్‌ ఈజ్‌ నాట్‌ వెల్‌గా ఉంది. ఆమ్‌ ఆద్మీపార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలీవాల్‌ ఇటీవల అరవింద్‌ కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లినప్పుడు ఆయన పర్సెనల్‌ సెక్రటరీ బైభవ కుమార్‌ ఆమెపై దాడి చేశాడు. దీంతో మలీవాల్‌ కుమార్‌ పై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు అయితే ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలు ప్రస్తుతం మీడియా చేతికి చిక్కాయి.

ఇక ఎఫ్‌ఐఆర్‌ కాపీలో ఉన్న అంశాల విషయానికి వస్తే .. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన కేజ్రీవాల్‌ను కలిసేందుకు స్వాతి ఆయన ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే బైభవ్‌కుమార్‌ తనను 7 నుంచి 8 సార్లు చెంపపై కొట్టాడని.. తాను గట్టిగా అరిచినా ఎవరూ పట్టించుకోలేదు. అతని నుంచి తప్పించుకునేందుకు తాను కుమార్‌ను నెట్టివేశానని చెప్పారు. అయినా ఆయన తనపైపడి.. కింద పడేసి లాగుకుంటూ వెళ్లాడని ఉద్దేశపూర్వకంగానే తన షర్టు లాగేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేస్తున్న తాను కుమార్‌కు తన ఆరోగ్యం బాగాలేదని ప్రస్తుతం తనకు నెలసరి పీరియడ్స్‌లో ఉన్నానని చెప్పినా.. పట్టించుకోలేదని మలివాలి పోలీసులు ముందు వాపోయారు.

గుండె, కడుపులో తన్నాడు..(Swati Maliwal Assault Case)

భైబవ్‌కుమార్‌ తనను కాళ్లతో తన్నడంతో పాటు గుండెపై, కడుపులో తన్నాడని.. పీరియడ్స్‌ ఉన్న తాను విపరీతమైన బాధకు గురయ్యానని చెప్పుకొచ్చారు. ఇక చాలు అని మొరపెట్టుకున్నా ఆపకుండా దాడి చేశాడని ఫిర్యాదు చేశారు. అటు తర్వాత తాను 112 నంబర్‌కు కాల్‌ చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. తాను112 ఫోన్‌ చేసినట్లు తెలిసిన వెంటనే బైభవ్‌కు పక్కగదిలోకి వెళ్లాడు. తర్వాత సీఎం కార్యాలయంలో ఉన్న సెక్యూరిటి సిబ్బందితో వచ్చి తనను సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వెళ్లిపోవాలని కోరారు. తనను దారుణంగా కొట్టారని వారికి కూడా చెప్పాను. తన గాయాలను సెక్యూరిటి సిబ్బంది కూడా చూశారని పోలీసులకు చెప్పారు స్వాతి.

కేజ్రీవాల్‌ మౌనం..

స్వాతి మలీవాల్‌పై జరిగిన దాడి పట్ల కేజ్రీవాల్‌ మాత్రం మౌనంగా ఉన్నారు. ఈ సంఘటనపై వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు. లక్నోలో అఖిలేష్‌యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు స్వాతిపై జరిగిన దాడి గురించి ప్రశ్నిస్తే ఆయన మౌనంగా వహించారు. అఖిలేష్‌ మాత్రం దీనికంటే ముఖ్యమైన అంశాలున్నాయన్నారు. అయితే రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌ మాత్ర కుమార్‌ స్వాతితో అసభ్యంగా ప్రవర్తించాడని అంగీకరించారు. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.