Home / Andhra Pradesh
ఎన్డీఏలో చేరిక అంశం పై ఇప్పుడేం స్పందించనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ ప్రయోజనాల కోసమే ఏన్డీఏ నుంచి బయటకు వచ్చామని, ఏపీ ప్రయోజనాల కోణంలోనే కేంద్ర రాజకీయాలను చూస్తాంమని చెప్పారు.
చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ భరత్ పీఏ మురుగేష్పై మున్సిపల్ వైస్ ఛైర్మన్ మునిస్వామి మారణాయుధాలతో దాడికి దిగాడు. ఈ ఘటనలో మురుగేష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఏపీ సీఎం జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మూడు రోజుల పాటు ఆయన కడప జిల్లాలోనే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ బయలుదేరి మధ్యాహ్నం 2:20 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.
పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకున్నందుకు ఇళ్ళ పట్టాలు వెనక్కి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ డిప్యూటీ సీఎంకు తన బాధను చెప్పుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలతో ముడిపెడుతూ తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలంగా పెండింగ్లో పెడుతూ వస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ కంపెనీల లావాదేవీల ప్రక్రియ
సీపీఎస్ రద్దు కోరుతూ'సెప్టెంబర్ 1వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసినట్టుగా ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అనేక విధాలుగా భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ సానుభూతి పరులు రెచ్చిపోయారు. పట్టణంలోని అన్నా క్యాంటీన్ పై అర్థరాత్రి దాడి చేశారు. ఫ్లెక్సీలను చించేయడంతో పాటు అక్కడి సామాగ్రిని ధ్వంసం చేశారు. ఘటనపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల కోసం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ పై దాడి
కాకినాడ జిల్లా వాకలపూడి ప్యారీ షుగర్ ఫ్యాక్టరీ మరోసారి ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఆగష్టు 12వ తేదీన ఇదే పరిశ్రమ లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన మరవకముందే మరో ప్రమాదం జరగడంతో కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం కుప్పం నియోజకవర్గంలో లో మూడో రోజు పర్యటిస్తున్నారు. కృష్ణానందపల్లి, గుండ్లనాయనపల్లి, కొత్తూరులో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు తిరగబడితే సీఎం జగన్ బయట తిరగలేరన్నారు.
సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్కు ఊరట లభించింది. రోజువారీ విచారణకు హాజరు కావాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. తనకు బదులు న్యాయవాది హాజరుకు అనుమతివ్వాలన్న జగన్ అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం తెలిపింది.