Home / Andhra Pradesh
ఏపీ రాజధానిగా అమరావతినే కోరుకుంటూ రాజధాని రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర 26రోజుకు చేరుకొనింది. అమరావతి నుండి అరసవళ్లి వరకు రైతులు పాదయాత్ర చేపట్టనున్నారు
గత మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు బాగా కురవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
Dussehra Festival: తెలుగు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని విధంగా దసరా ఉత్సవాలు
అది ఓ అరుదైన వ్యాధి. ప్రపంచంలోనే ఏ నలుగురైదుగురో ఈ వ్యాధి బారినపడి బాధపడుతుంటారు. అలాంటి రేర్ వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి సీఎం జగన్ తన దాతృత్వాన్ని చాటాడు. ఆ చిట్టితల్లి వైద్యానికి కోటిరూపాయిలు మంజూరు చేశారు. ఆ డబ్బుతో అత్యంత ఖరీదైన 10 ఇంజెక్షన్లను తొలి విడతగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా బాధితులకు ఆదివారం అందించారు.
లోన్ యాప్స్ వేధింపులకు ఏపీలోని మరో ప్రాణం బలయ్యింది. మైక్రో ఫైనాన్స్ మరియు లోన్ యాప్స్ ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. దీనితో చేసేదేం లేక ఇప్పటికే చాలామంది యువతీ యువకులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో లోన్‌యాప్ అరాచకానికి మరో యువకుడు ప్రాణం తీసుకున్నాడు.
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతా(జైటిడిపి) హ్యాకింగ్‌కు గురైనట్లు టిడిపి డిటిజల్ వింగ్ శనివారం మధ్యాహ్నం ఓ ప్రకటన చేసింది. తమ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని తెలిపింది.
ఏపీలో రాక్షస ప్రభుత్వం నడుస్తోందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. తన కుమారుడు చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ పోలీసులు వెళ్లడం పై స్పందించిన అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నోటీసులు ఇవ్వకుండా సీఐడీ పోలీసులు ఎలా వస్తారని ప్రశ్నించారు.
ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చెందిన ఇందు భారత్ ధర్మల్ కంపెనీపై దాఖలైన సీబీఐ కేసు విచారణను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ పోలీసులు రావడం కలకలం రేపింది. బంజారాహిల్స్‌లోని విజయ్ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు శనివారం వచ్చారు. హైదరాబాద్ లోని విజయ్ ఇంట్లో అతను లేకపోవడంతో అతని సిబ్బందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
తమ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్‌రావు, కేసీఆర్‌కు లేదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ది పై చర్చకు సిద్దమా అని హరీష్‌రావుకు సవాలు విసిరారు. హరీశ్ రావు గొప్పలు చెప్పుకుంటే చెప్పుకో. మమ్మల్ని పోల్చాల్సిన అవసరం లేదు.