Home / Ambati Rambabu
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పై మరోసారి మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న పవన్ దగ్గర ఉంటారో.. లేదా జగన్ మోహన్ రెడ్డిని నమ్ముకున్న అంబటి వెంట ఉంటారో కాపులు తేల్చుకోవాలని ఆయన సూచించారు.
ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు సంబంధించి వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
వారాహికి బదులుగా వరాహం అని పెట్టుకో.. మంత్రి అంబటి రాంబాబు
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్తెనపల్లిలో కౌలురైతు భరోసా యాత్ర సందర్భంగా బాధిత కౌలు రైతు కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం సభా వేదికపై ప్రసంగిస్తూ వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. అంబటి రాంబాబు నియోజకవర్గంలో అడుగుపెట్టిన పవన్ అంబటి కాపుల గుండెల్లో కుంపటి అంటూ విమర్శించాడు. సత్తెనపల్లిలో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా అవినీతి చేస్తున్నాడని అంబటిని ఉద్దేశించి పవన్ విమర్శలు గుప్పించారు. రూ. 7లక్షల ఇన్స్యూరెన్స్ వస్తే […]
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మంత్రుల మధ్య మరోసారి డైలాగ్ వార్ నడిచింది. ఇటీవల ఏపీలో ఉపాధ్యాయుల పరిస్థితి గురించి వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు. తాజాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై కామెంట్స్ చేశారు.
తమ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్‌రావు, కేసీఆర్‌కు లేదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ది పై చర్చకు సిద్దమా అని హరీష్‌రావుకు సవాలు విసిరారు. హరీశ్ రావు గొప్పలు చెప్పుకుంటే చెప్పుకో. మమ్మల్ని పోల్చాల్సిన అవసరం లేదు.
పాదయాత్ర కాదు, అది ఒళ్లు బలిసిన యాత్రగా రాజధాని రైతుల పాదయాత్రనుద్ధేశించి మంత్రి అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పోలవరం పై చర్చించేందుకు టీడీపీ అధినేత ఒకరోజు అసెంబ్లీకి రావాలని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కోరారు. శాసనసభకు వస్తే టీడీపీ చేస్తున్న సవాళ్ల పై చర్చిద్దామని ఆయన అన్నారు.
ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అవుతున్నా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని బీజేపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మంత్రి అంబటి రాంబాబు నుద్దేశించి మాట్లాడారు
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన రెండవ విడత మహా పాదయాత్రను మంత్రి అంబటి రాంబాబు బూటకపు యాత్రగా అభివర్ణించారు. ఆ మాటలను ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొనగా నెటిజన్లు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.